BREAKING
వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా కేటీ జకారియా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం: ఈ నెల 14 లేదా 15న నోటిఫికేషన్ విడుదల! బంగ్లాదేశ్‌లో వైభవంగా మహాలయ వేడుకలు దసరా సెలవులు.. విద్యార్థులకు అవస్థలు! జై శ్రీరామ్ యూత్ ఆధ్వర్యంలో, ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు* పాకల బీచ్ విషాదంపై ఎమ్మెల్యే తాటిపర్తి దిగ్భ్రాంతి.. "సంతాపంతో సరిపెట్టొద్దు తాగునీరు కరువు.. రోడ్డెక్కిన కాలనీవాసులు *పూల పండుగకు శ్రీకారం.. పల్లెల్లో బతుకమ్మ సందడి!* *•ఆటపాటలతో అంబరాన్నంటిన సంబురాలు* కోటి రూపాయలతో రోడ్డు పనులకు శంకుస్థాపన సముద్రపు దీపస్తంభాల అద్భుత రూపాంతరం త్రివేణి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు వారణాసిలో ఫిట్ ఇండియా సైకిల్ యాత్ర...ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి రేపు తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురంలో మెగాస్టార్ చిరంజీవి పర్యటన దసరా సంబరాల టెండర్లలో గోల్‌ మాల్‌ - ఎసి విచారణ - టెండర్లు రద్దు? తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి కేటీఆర్ అండ ముగ్గురు ఆడబిడ్డల పేరిట ఒక్కొక్కరికి రూ.3 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్

పేదలకు కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందించడమే లక్ష్యం: మంత్రి నిమ్మల.* *రూ.1.25 కోట్ల ఈసీఐఎల్‌ సీఎస్‌ఆర్‌ నిధులతో పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి ఆధునిక వైద్య పరికరాలు.

Select Suryaa Now
పేదలకు కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందించడమే లక్ష్యం: మంత్రి నిమ్మల.*  *రూ.1.25 కోట్ల ఈసీఐఎల్‌ సీఎస్‌ఆర్‌ నిధులతో పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి ఆధునిక వైద్య పరికరాలు.

పాలకొల్లు సూర్య న్యూస్ , మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్‌ ఆసుపత్రులకు వెళ్లే అవసరం లేకుండా ప్రభుత్వ ఆసుపత్రిలోనే మెరుగైన ఆధునిక వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో పాలకొల్లు వంద పడకల ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌) సంస్థ సామాజిక బాధ్యత కార్యక్రమం క్రింద రూ.1.25 కోట్ల విలువైన ఆధునిక వైద్య పరికరాలను పాలకొల్లు ఇమిడి సత్యనారాయణ వంద పడకల ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి అందజేసింది. ఈ సందర్భంగా శనివారం ఆసుపత్రిలో వైద్య పరికరాలను ప్రారంభించి, అందుబాటులోకి తీసుకొచ్చారు

.ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌, జిల్లా సంయుక్త కలెక్టర్‌ కల్పశ్రీ, ఈసీఐఎల్‌ సంస్థ రక్షణ విభాగం జనరల్‌ మేనేజర్‌ శార్వరీ దేవి, సీఎస్‌ఆర్‌ విభాగం బాధ్యతల అధికారి డాక్టర్‌ పి. వేణుబాబు, ఉప నిర్వాహకుడు జె. సునీల్‌కుమార్‌, సంస్థ మాజీ కార్యనిర్వాహక సంచాలకుడు మురళి, రెవెన్యూ డివిజనల్‌ అధికారి దాసిరాజు తదితరులు హాజరై వైద్య పరికరాలను ప్రారంభించారు.ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మంత్రి నిమ్మల రామానాయుడుకు అత్యవసర మంత్రివర్గ సమావేశానికి హాజరు కావాల్సిందిగా సమాచారం అందడంతో ఆయన అమరావతికి బయలుదేరి వెళ్లారు.

 అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం కావాల్సి రావడంతో కార్యక్రమానికి ప్రత్యక్షంగా హాజరు కాలేకపోయారు. దీంతో అమరావతి నుంచి సెల్‌ఫోన్‌ ద్వారా సభను ఉద్దేశించి మాట్లాడారు. రూ.1.25 కోట్ల విలువైన వైద్య పరికరాలను అందించిన ఈసీఐఎల్‌ సంస్థకు, కార్యక్రమానికి హాజరైన సంస్థ ప్రతినిధులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలకొల్లు 50 పడకల ఆసుపత్రిని వంద పడకల స్థాయికి పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారని మంత్రి గుర్తుచేశారు. ఆసుపత్రి భవన నిర్మాణానికి రూ.12.60 కోట్లు మంజూరు చేసి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. అయితే ప్రభుత్వం మారడంతో నిర్మాణ పనులు ఆశించిన విధంగా ముందుకు సాగలేదని, ఐదేళ్లపాటు కొనసాగిన గత ప్రభుత్వ హయాంలోనూ ఆసుపత్రి భవనం పూర్తికాలేదని పేర్కొన్నారు.

మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆసుపత్రి భవన నిర్మాణాన్ని అన్ని సౌకర్యాలతో పూర్తిచేయడంతో పాటు ఆసుపత్రి ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి వివరించారు. డయాలసిస్‌ సేవల కోసం కోటి రూపాయలు వెచ్చించడంతో పాటు మొత్తం రూ.24.30 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ఆసుపత్రిలో జరుగుతున్నాయని తెలిపారు. పేదలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా వైద్య సదుపాయాలను మరింత విస్తరిస్తున్నామని చెప్పారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనూ, ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలోనూ అభివృద్ధి పనులు జరిగాయని, గత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో ఆసుపత్రి అభివృద్ధికి నిధులు ఖర్చు చేయలేదని మంత్రి విమర్శించారు.

మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌ మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలు కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోవడం ఆర్థికంగా భారంగా మారుతున్న నేపథ్యంలో పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిని ఆధునిక వైద్య సదుపాయాలతో అభివృద్ధి చేయడం ప్రజలకు ఎంతో ఉపయోగకరమని అన్నారు. ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి మంత్రి నిమ్మల రామానాయుడు చేస్తున్న కృషిని ప్రశంసించారు.ఈసీఐఎల్‌ సంస్థ రక్షణ విభాగం జనరల్‌ మేనేజర్‌ శార్వరీ దేవి మాట్లాడుతూ పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి అవసరమైన ఆధునిక వైద్య పరికరాలను అందజేయడం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తమ సంస్థ సహకారం అందించిందని తెలిపారు. సంస్థ సామాజిక బాధ్యత కార్యక్రమం ద్వారా అందించిన పరికరాలు ప్రజలకు ఉపయోగపడటం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం సాకారం కావడానికి వేణుబాబు ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈసీఐఎల్‌ ప్రతినిధులు, జిల్లా సంయుక్త కలెక్టర్‌ కల్పశ్రీలను మంత్రి నిమ్మల రామానాయుడు తరఫున ఘనంగా సన్మానించారు

. ఈ కార్యక్రమంలో పాలకొల్లు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కోడి విజయభాస్కర్‌, కూటమి నాయకులు పెచ్చెట్టి బాబు, గండేటి వెంకటేశ్వరరావు, ఉన్నమట్ల కబర్ది, రియా, వల్లభ శ్రీనివాస్‌, కర్నేన గౌరునాయుడు, పొట్నూరి శ్రీనివాస్‌, కొల్లి కొండ ప్రసాద్‌, మామిడిశెట్టి పెద్దిరాజు, పెనుమత్స రాంబద్రరాజు, చినిమిల్లి గణపతి, సురేష్‌, ధనానీ సూర్యప్రకాశ్‌, పీతల శ్రీనివాస్‌, కొలుకులూరి జయప్రకాశ్‌ నారాయణ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ పి. సూర్యనారాయణ, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వై. మాధురి, డాక్టర్‌ జనార్దన్‌ తదితరులు పాల్గొన్నారు.

 రిపోర్టర్ నరసింహారావు పాలకొల్లు పశ్చిమగోదావరి జిల్లా