BREAKING
అంజయ్య నగర్ గుల్షన్ నగర్‌లో నూతన డ్రైనేజీ పైప్‌లైన్ పనులు ప్రారంభం శ్రీరాముడి పాత్ర దక్కడం నా అదృష్టం: ఐదు వేల ఏళ్ల కిందటే భారత్‌లో ఎగిరే వాహనాలు ఉన్నాయన్న రణ్‌బీర్ కపూర్ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి.. అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయొద్దు: డీఎస్పీ కాజల్ జైస్వాల్ ఘనంగా ఏఐటీయూసీ 107వ జయంతి వేడుకలు...... కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్యంగా ఉద్యమించాలి: నాయకుల పిలుపు నానక్‌రాంగూడలో ఘనంగా దర్గా నియాజ్ పాల్గొన్న మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్: నవంబర్ 1న రామ్‌చరణ్, సుకుమార్ ‘RC 17’ గ్రాండ్ లాంచ్ షారుఖ్ ఖాన్ 'కింగ్' సినిమా నుంచి తప్పుకున్న అనిరుధ్ రవిచందర్: కారణమేంటంటే? టూ మచ్ ఫన్, యాక్షన్ తో సూర్య 'సీన్' ట్రైలర్ రిలీజ్: నవంబర్ 6న భారీ కానుకగా రాబోతున్న చిత్రం రూపశ్రీ కౌంటీ కాలనీలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించిన మాజీ మున్సిపల్ చైర్మన్ తరుణ్ భాస్కర్, విశ్వక్ సేన్ కల్ట్ సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు: నవంబర్ 3న వినోదాల జాతర సమ్మర్ హాలిడేస్ సినిమా చూస్తూ మీ బాల్యాన్ని గుర్తు తెచ్చుకుంటారు: నిర్మాత ధీరజ్ మొగిలినేని *నూతన సుగుణ చికెన్ సెంటర్ ప్రారంభించిన మున్సిపల్ వైస్ చేర్మెన్ దారం శంకర్* బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే ఎన్ఎంఆర్ డివిజన్ ఇన్‌చార్జి రవి ముదిరాజ్ లక్ష్యం! పోలీసు బృందాలను అభినందించిన ఎసిపి శ్రీనివాస్ కుమార్ -పదవీ విరమణ సందర్భంగా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి ఘన సన్మానం

పల్లె ప్రగతికి సైకిల్ గుర్తుకు ఓటేద్దాం

Select Suryaa Now
పల్లె ప్రగతికి సైకిల్ గుర్తుకు ఓటేద్దాం

పల్లె ప్రగతి కోసం సైకిల్ కు ఓటేద్దాం
-డా.యం.ఉమేష్ రావు, 

గత వైసిపి ప్రభుత్వ పాలనాకాలంలో జగన్ రెడ్డి నిర్లక్ష్యం కారణంగా మరుగున పడిన గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను మళ్ళీ ప్రారంభించి పల్లెలను ప్రగతి పథంలో నడిపించడానికి సైకిల్ గుర్తుకు ఓట్లేయమని తొట్టంబేడు మండల ఓటరు మహాశయులను తెలుగుదేశం పార్టీ బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు విజ్ఞప్తి చేశారు.

తొట్టంబేడు మండలం, జెడ్పీటీసీ స్థానానికి ఎన్డీయే కూటమి బలపరచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, తొట్టంబేడు మండల అధ్యక్షుడు రావిళ్ళ మునిరాజా నాయుడుకి మద్దతుగా నిలిచి, తమ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై ముద్రించి అఖండ విజయాన్ని చేకూర్చమని ఈరోజు తొట్టంబేడు యంపిటీసీ సెగ్మెంట్, బీడీ కాలనీ లోని ఓటరు మహాశయులను కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది.

*పల్లె ప్రగతికి పల్లె పండుగ 3.0 ఊతం*

ఒకవైపు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూనే, అభివృద్ధికి కార్యక్రమాలను కూడా సమాంతరంగా చేపడుతున్న ఎన్డీయే కూటమి ప్రభుత్వ పాలనలోనే  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్లెలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయని, దానిలో భాగంగానే సియం చంద్రబాబు, డిప్యూటీ సియం పవన్ కళ్యాణ్ ద్వయం పల్లె పండుగ 3.0 ద్వారా సుమారు పదకొండు వేల ఎనభై ఐదు కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారని, దీనితో ఏపీ పల్లెలను స్వర్ణ పంచాయతీలుగా తీర్చిదిద్దడానికి నిబద్ధతతో పనిచేస్తున్నారని కొనియాడారు. ప్రజావసరాల ప్రాధాన్యతను గుర్తించి పల్లె పండుగ 3.0 ద్వారా కూటమి ప్రభుత్వం ద్వారా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారని తెలిపారు.

*రహదారి కష్టాలకు చెక్ పెట్టిన పల్లె పండుగ 3.0*

గ్రామీణుల రోడ్డు కష్టాలకు శాశ్వత పరిష్కారానికి తగిన విధంగా చర్యలు చేపట్టిన సియం చంద్రబాబు మరియు డిప్యూటీ సియం పవన్ కళ్యాణ్ దార్శనిక పాలనలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం పల్లె బాటల కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపుతూ పల్లె పండుగ 3.0 లో కూటమి ప్రభుత్వం ద్వారా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిందని, సుమారు రూ.2,700 కోట్లతో 6,000 కి.మీల అంతర్గత రహదారులు వేస్తుండటం, అలాగే పల్లెల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం కోసం మరో రూ.1,750 కోట్లతో 2,500 కి.మీల బీటీ రోడ్లు నిర్మిస్తున్న ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి ప్రజలు తమ ఆశీస్సులు మెండుగా అందించాలని విజ్ఞప్తి చేశారు.

*మౌలిక వసతుల కల్పనకు తొలి ప్రాధాన్యత*

గత పాలకులు అశ్రద్ధ చేయడం ద్వారా ఉన్న వాటికి నిర్వహణ లేక, కొత్తవి రాక ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడిన పల్లెల్లో సమూలంగా మార్పు తెస్తూ పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని ఎన్డీయే కూటమి ప్రభుత్వం చేపట్టడం ద్వారా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.పరిశుభ్రమైన మరియు స్వచ్ఛమైన గ్రామాలు, సౌకర్యవంతమైన అత్యాధునిక రహదారులు, పాడి రైతులకు అవసరమైన అండ, పచ్చని ఉద్యాన తోటల పెంపకం వంటి అనేక కార్యక్రమాల సమగ్ర గ్రామీణ అభివృద్ధి కార్యక్రమం అయిన పల్లె పండుగ 3.0 ద్వారా మన శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కూడా స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కూడా తీసుకుంటున్న ప్రగతి అడుగులతో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పల్లెల ముఖచిత్రంలో మార్పు కనిపించనుందని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి యం.సుబ్బయ్య, బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం. ఉమేష్ రావు, తంగేళ్ళ పాలెం పిఏసియస్ ఛైర్మన్ బీమాల భాస్కర్, శ్రీకాళహస్తి పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రం కిషోర్, తొట్టంబేడు యం.పి.టి.సి. సెగ్మెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చిల్లకూరు ఆనందమ్మ, శ్రీకాళహస్తి పట్టణ సహకార బ్యాంకు మాజీ ఛైర్మన్ డి.వి.నారాయణ, తొట్టంబేడు మండల ప్రధాన కార్యదర్శి చిల్లకూరు మణి, తిరుపతి పార్లమెంటు నాయకులు మునిరాజా యాదవ్, సయ్యద్ చాంద్ బాషా, గాజుల భగత్, గగన్ యాదవ్, వెంకటేశ్వర్లు, చందు, ముని, శివ, భువన కుమార్, రవితేజ తదితరులు పాల్గొన్నారు. వీసీ వెంకటయ్య సూర్య దినపత్రిక ఇన్చార్జి శ్రీకాళహస్తి*  9644411197