పలమనేరులోని మదర్ థెరిసా ఇన్‌స్టిట్యూట్‌లో మేధో సంపత్తి హక్కులు పారిశ్రామికవేత్తల అభివృద్ధిపై అవగాహన కార్యక్రమం
పలమనేరు మేజర న్యూస్ 2026: భారత ప్రభుత్వ సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ( ఎం ఎస్ ఎం ఈ) ఆధ్వర్యంలోని ఆర్ఏఎంపి పథకంలో భాగంగా, ఐఐఐ కర్నూలు సహకారంతో, జిల్లా పరిశ్రమల కేంద్రం (డి ఐ సి ) చిత్తూరు వారి మద్దతుతో, పలమనేరులోని మదర్ థెరిసా ఇన్‌స్టిట్యూట్‌లో మేధో సంపత్తి హక్కులు (ఇంటెలెక్చ్యువల్ ప్రాపర్టీ రైట్స్ – ఐ పి ఆర్ ) పారిశ్రామికవేత్తల అభివృద్ధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో మదర్ థెరిసా ఇన్‌స్టిట్యూట్ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీకాంత రెడ్డి, ఎంబీఏ విభాగాధిపతి డాక్టర్ వీణ తమ విలువైన సహకారం, మార్గదర్శకత్వం అందించారు. డి ఐ సిటి డి ఏం చిత్తూరు జనరల్ మేనేజర్ సూరిబాబు వారి బృందం ఈ కార్యక్రమ నిర్వహణకు విశేష సహకారం అందించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీకాంత రెడ్డి మాట్లాడుతూ.…
నూతన ఆవిష్కరణలు, పారిశ్రామిక ఆలోచనా విధానం, నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. కేవలం ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా, ఇతరులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే స్థాయికి ఎదగాలని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సూచించారు. దేశ ఆర్థికాభివృద్ధికి పారిశ్రామిక దృక్పథం ఎంతో అవసరమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్‌గా పాల్గొన్న నాగరాజు మేధో సంపత్తి హక్కులు పారిశ్రామికవేత్తల అభివృద్ధిపై సమగ్ర అవగాహన కల్పించారు. పేటెంట్లు, ట్రేడ్‌మార్క్‌లు వంటి మేధో సంపత్తి హక్కుల పరిరక్షణ ప్రాముఖ్యతను వివరించారు. నూతన ఆలోచనలు, ఆవిష్కరణలు చేసిన వారు తమ మేధో సంపత్తిని చట్టబద్ధంగా ఎలా రక్షించుకోవాలి వాటిని వాణిజ్యపరంగా ఎలా అభివృద్ధి చేసుకోవాలి అనే అంశాలపై విలువైన సూచనలు అందించారు.ఈ కార్యక్రమం ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు పరిశోధకులకు మేధో సంపత్తి హక్కుల పరిరక్షణ, పారిశ్రామిక అవకాశాలు, ఆర్ఏఎంపి పథకం ద్వారా సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ( ఎం ఎస్ ఎం ఈఎస్ ) ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలపై అవగాహన కల్పించబడింది. వినూత్న ఆలోచనలను అభివృద్ధి చేసుకోవడం, తమ మేధో సంపత్తిని పరిరక్షించుకోవడం, వాటిని విజయవంతమైన వ్యాపార సంస్థలుగా తీర్చిదిద్దుకోవడం వంటి అంశాలపై ఈ కార్యక్రమం ప్రోత్సాహాన్ని అందించింది.
కార్యక్రమం ముగింపు సందర్భంగా ఐ ఐ ఐ టి డి ఏం కర్నూలుకు చెందిన డాక్టర్ నోయల్ కృతజ్ఞతా ప్రసంగం చేస్తూ, మదర్ థెరిసా ఇన్‌స్టిట్యూట్ యాజమాన్యం, ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీకాంత రెడ్డి, ఎంబీఏ విభాగాధిపతి డాక్టర్ వీణ, రిసోర్స్ పర్సన్, అధ్యాపకులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు మరియు కార్యక్రమ విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.అదేవిధంగా,పథకం కింద ఈ కార్యక్రమ నిర్వహణకు అవసరమైన ఆర్థిక సహాయం మరియు సహకారాన్ని అందించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఏపీ ఏం ఎస్ ఏం ఈ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సీఈఓ విశ్వ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే, కార్యక్రమ నిర్వహణకు విశేష సహకారం, ప్రోత్సాహం మద్దతు అందించిన డి ఐ సి చిత్తూరు జనరల్ మేనేజర్ సూరిబాబుడి ఐ సి చిత్తూరు బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
రిపోర్టర్ : అనిల్ కుమార్ యాదవ్