పారిశుద్ధ్య కార్మికులకు అల్పాహారం అందించిన కందిమల్ల మాలకొండ రాయుడు
పారిశుద్ధ్య కార్మికులకు అల్పాహారం అందించిన కందిమల్ల మాలకొండ రాయుడు
పామూరు, మేజర్ న్యూస్ :
మండలంలోని బొట్లగూడూరు గ్రామానికి చెందిన కందిమల్ల మాలకొండ రాయుడు సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. బొట్లగూడూరు గ్రామానికి చెందిన కోటపాటి కిషోర్ కుమారుడు ధర్మదేవ్ పుట్టినరోజు సందర్భంగా కేపీహెచ్‌బీ ప్రాంతంలో జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు అల్పాహారం అందించారు. ప్రజల ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమించే పారిశుద్ధ్య కార్మికుల సేవలను గుర్తించి వారికి అల్పాహారం అందించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. పుట్టినరోజు వేడుకను సేవా కార్యక్రమంతో ముడిపెట్టి కందిమల్ల మాలకొండ రాయుడు ఆదర్శంగా నిలిచారు.