ఒక అవకాశం ఇస్తే.. అభివృద్ధి చేసి చూపిస్తా..!
ఒక అవకాశం ఇస్తే.. అభివృద్ధి చేసి చూపిస్తా..!
- నందికొట్కూరు 20వ వార్డు అభివృద్ధే లక్ష్యం
- సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తా
- సహకరించిన పాత్రికేయులకు ధన్యవాదాలు
- టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థిగా డాల్ శేషన్న నామినేషన్ దాఖలు
నందికొట్కూర్ రూరల్ మేజర్ న్యూస్ -:
మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డు ప్రజలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తనను గెలిపించి ఒక అవకాశం తనకి ఇస్తే. అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానని టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థిగా డాల్ శేషన్న పేర్కొన్నారు. శనివారం
నందికొట్కూరు పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. డాల్ శేషన్న నామినేషన్ దాఖలు చేశారు. నంద్యాల తెదేపా పార్లమెంటు ఇంచార్జ్ మాండ్ర శివానందరెడ్డి,ఎమ్మెల్యే గిత్త జయసూర్య నాయకత్వంలో 20వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా డాల్ శేషన్న బరిలో నిలిచారు.ఈ సందర్భంగా డాల్ శేషన్న మాట్లాడుతూ.. 20వ వార్డు సమగ్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. వార్డులో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటానని తెలిపారు.
వార్డు ప్రజలు తనను ఆదరించి, అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజల ఆశీస్సులతో విజయం సాధించి వార్డు అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని పేర్కొన్నారు.20వ వార్డు కౌన్సిలర్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా డాల్ శేషన్న బరిలో నిలిచేందుకు తనకు సహకరించిన నంద్యాల తెదేపా పార్లమెంటు ఇంచార్జ్ మాండ్ర శివానందరెడ్డి, ఎమ్మెల్యే గిత్త జయసూర్య మరియు పాత్రికేయులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.