నియోజకవర్గ జనసేన సమన్వయకర్తలు ముగ్గురు.
పెడన, మేజర్ న్యూస్: జనసేన పార్టీ నియోజకవర్గానికి ముగ్గురు సమన్వయకర్తల నియామకాన్ని జనసేన కోఆర్డినేషన్ కమిటీ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించారు. ఈ మేరకు వికృతి శ్రీను( కొరియర్ శ్రీను), లింగం నాగేశ్వరరావు, అంకెం లక్ష్మీ శ్రీనివాస్ లను నియమించారు. ఈ సందర్భంగా వీరితోపాటు మరొక 32 మంది (నిర్వాహక దళ్ )సభ్యుల గాను ఐదుగురిని సహాయకులు (సపోర్ట్ టీం )గాను నియమించడం జరిగింది. రానున్న రోజుల్లో జనసేన పార్టీ బలోపేతం చేసే దిశగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన క్షేత్రస్థాయి సమాచారాన్ని పార్లమెంట్ సమన్వయ కమిటీకి వీరు తెలియపరచాల్సి ఉంది. ఏది ఏమైనా ముగ్గురు సమన్వయకర్తల తో నియోజకవర్గనికి నియమించడం పట్ల జన సైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో ఎన్నడూ కూడా ఇలా నియోజకవర్గం నికి ముగ్గురు సమన్వయకర్తలు లేరని ఇదే ప్రథమం అని విశ్లేషకులు చెబుతున్నారు.