BREAKING
బాలాజీ ఫార్మసీ కళాశాలలో కృత్రిమ మేధస్సుపై జాతీయ సదస్సు మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ---నషా ముక్త్ భారత్ అభియాన్ కమిటీ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్ ఎమ్మెల్యే జారె ఆదినారాయణను మర్యాదపూర్వకంగా కలిసిన కొప్పుల రాంబాబు* ఉపసంహరించుకున్న అభ్యర్థికి మ్యాండిట్ ఎలా ఇచ్చారు? --ఎంపీటీసీ అభ్యర్థుల ఆరోపణ బ్రాహ్మణపల్లె, తిప్పాయపల్లెలో టీడీపీ ప్రచారం దేశ ఐక్యత, సమగ్రత, భద్రత పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి గుండెపోటుతో యువకుడు మృతి -- కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, గడ్డ మణుగు రవికుమార్ మెదక్ జిల్లాలో మనోహరాబాద్ ఒక్కటే కరువు పీడిత మండలం గ్రామానికి మౌలిక వసతులు సమకూరుస్తా -- స్వతంత్ర ఎంపీటీసీ అభ్యర్థి చాట్రాతి ప్రసాద్ గుమ్మేపల్లిలో జోరందుకున్న సైకిల్ ప్రచారం – అభ్యర్థులకు ప్రజల మద్దతు కోరిన నాయకులు* రాష్ట్రస్థాయి మాక్ పార్లమెంట్‌లో మెదక్ విద్యార్థినికి ప్రథమ స్థానం ఎల్‌నినో ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి వన్యప్రాణులను వేటాడుతున్న ముగ్గురు నిందితులు అరెస్ట్* * రెండు తుపాకులు, 37 ఇనుప గుండ్లు స్వాధీనం… వన్యప్రాణుల మాంసం విక్రయిస్తే కఠిన చర్యలు-సీఐ నాగరాజు, ఎస్సై రాజేష్ కుమార్..* పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలి బ్రిడ్జి నిర్మాణానికి మట్టి నమూన సేకరణ... మట్టి నమూన పనుల పరిశీలిస్తున్న ఆర్ అండ్ బి అధికారులు...

నెల్లూరులో ఘనంగా వికసిత భారత్ యువ నాయకుల సంభాషణ – 2027 యువజన పార్లమెంట్

Select Suryaa Now
నెల్లూరులో ఘనంగా వికసిత భారత్ యువ నాయకుల సంభాషణ – 2027 యువజన పార్లమెంట్

నెల్లూరు  కలెక్టరేట్ , మేజర్ న్యూస్  :    నెల్లూరు నగరంలోని నారాయణ ఇంజినీరింగ్ కళాశాలలో మేరా యువ భారత్ ఆధ్వర్యంలో 'వికసిత భారత్ యువ నాయకుల సంభాషణ – 2027' యువజన పార్లమెంట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విక్రమసింహపురి విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావు, నారాయణ వైద్య కళాశాల సంచాలకులు డాక్టర్ పి. శ్రీనివాసులు రెడ్డి, నారాయణ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి. రవిప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ముందుగా ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఈ సందర్భంగా జిల్లా యువజన అధికారి బి. శశికాంత్ రెడ్డి మాట్లాడుతూ, యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం, ప్రజాస్వామ్య వ్యవస్థపై సంపూర్ణ అవగాహన కల్పించడమే యువజన పార్లమెంట్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. వికసిత భారత్ – 2047 లక్ష్య సాధనలో యువత పాత్ర అత్యంత కీలకమని, నవభారత నిర్మాణంలో యువత సరికొత్త ఆలోచనలతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

విక్రమసింహపురి విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో యువత కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకుండా నాయకులుగా, నూతన ఆవిష్కర్తలుగా ఎదగాలని సూచించారు. పార్లమెంటరీ విధానాలు, చట్టాల రూపకల్పన, సమకాలీన అంశాలపై యువతకు అవగాహన అవసరమని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సృజనాత్మకతను, వక్తృత్వ నైపుణ్యాలను వెలికితీస్తాయని తెలిపారు.

నారాయణ వైద్య కళాశాల సంచాలకులు డాక్టర్ పి. శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ, క్రమశిక్షణ, సామాజిక స్పృహ ఉన్నప్పుడే యువత సరైన మార్గంలో పయనిస్తుందని అన్నారు. యువశక్తిని సరైన దిశలో వినియోగిస్తే దేశం అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలుస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు విద్యాభ్యాసంతో పాటు నాయకత్వ నైపుణ్యాలను కూడా పెంపొందించుకోవాలని సూచించారు.

అనంతరం నిర్వహించిన యువజన పార్లమెంట్‌లో విద్యార్థులు వివిధ సమకాలీన అంశాలపై పార్లమెంట్ సభ్యుల తరహాలో చర్చలు, వాదనలు, ప్రతివాదనలు, సమాధానాలతో నమూనా సభను నిర్వహించి ఆకట్టుకున్నారు.

ఈ కార్యక్రమంలో నారాయణ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి. రవిప్రసాద్, జాతీయ సేవా పథకం కార్యక్రమ అధికారులు కార్తీక్, చంద్రమోహన్, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.