నెల్లూరు ప్రజలకు అంకితభావంతో సేవ చేయాలని సూచన
నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్ : కూటమి అభ్యర్థిగా పోటీ చేసి నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్‌గా ఘన విజయం సాధించిన తెలుగు దేశం నాయకులు పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ బుధవారం నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ని, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల్లో అన్ని విధాలా అండగా నిలిచి, తన విజయానికి సహకరించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా దంపతులిద్దరినీ సత్కరించారు. కూటమి నేతల మార్గదర్శకత్వంలో నెల్లూరు నగర అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. కూటమి అభ్యర్థిగా పోటీ చేసి 80 వేలకు పైగా మెజారిటీతో ఘన విజయం సాధించినందుకు రూప్ కుమార్ యాదవ్ ని వీపీఆర్ దంపతులు అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు. నెల్లూరును అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని సూచించారు.