BREAKING
దీక్ష దివస్ కార్యక్రమానికి బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కొత్త ప్రభాకర్‌రెడ్డి చేతుల మీదుగా.. * టీఆర్‌ఆర్‌ఎస్‌ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ.. ఘనంగా పోచమ్మ,ఎల్లమ్మ దేవాలయాల గడప నిర్మాణం కార్యక్రమం లక్షలు వెచ్చించి లక్షణంగా వదిలేశారు...... * సంవత్సరాలు గడుస్తున్న ప్రారంభానికి నోచుకోని హెల్త్ సెంటర్ భవనం బోరు మోటార్, దొంగల అరెస్ట్ మోటార్, కేబుల్ వైర్, పల్సర్ బైక్ స్వాధీనం పలుశుభ కార్యక్రమాలకు హాజరైన గ్రామ సర్పంచ్ బండారి లక్ష్మి & బాలరాజు కరీంనగర్‌లో దీక్షా దివస్ సభకు కదిలిన గుండారెడ్డిపల్లి గులాబీ దండు కోహెడ జూనియర్ క్రికెట్ జట్టుకు ఘన సన్మానం ముద్ర రుణం.. బ్యాంకు వసూళ్ల వేధింపులు! కేసీఆర్ నిరాహార దీక్ష.. తెలంగాణకు విజయదీక్ష! కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కీలక మలుపు! రామానుజ పల్లి సర్పంచ్ గా పొట్టేలి సుధా మరో అవకాశం.. నేడు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అంతరాత్మకు కట్టుబడి నిష్పక్షపాతంగా తీర్పులు వెలువరించాలి కౌంటింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు

నకరికల్లు మండలంలో వరి పంట కోత ప్రయోగం.. ఎకరాకు 36 నుంచి 38 బస్తాల దిగుబడి అంచనా

Select Suryaa Now
 నకరికల్లు మండలంలో వరి పంట కోత  ప్రయోగం.. ఎకరాకు 36 నుంచి 38 బస్తాల దిగుబడి అంచనా

నకరికల్లు, మేజర్ న్యూస్: పల్నాడు జిల్లా నకరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామ పరిధిలోని బాలాజీనగర్ తండాలో శనివారం వరి పంట కోత ప్రయోగం వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించారు.
 
తండాకు చెందిన రామావత్ భారతి బాయి, రామదాసు దంపతులకు చెందిన వరి పొలంలో అంకురపద్మ రకానికి సంబంధించి పంట కోత ప్రయోగం చేపట్టారు. వ్యవసాయ శాఖ నిబంధనల ప్రకారం 5 మీటర్ల పొడవు, 5 మీటర్ల వెడల్పుతో మొత్తం 25 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కోత ప్రయోగం నిర్వహించగా, 19.640 కిలోల ధాన్యం దిగుబడి నమోదైంది. ఈ లెక్కల ఆధారంగా ఎకరాకు సుమారు 36 నుంచి 38 బస్తాల దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.
 
ఈ సందర్భంగా పల్నాడు జిల్లా వ్యవసాయ అధికారి మునావత్ జగ్గారావు మాట్లాడుతూ.. పంట కోత ప్రయోగాల ద్వారా సేకరించే దిగుబడి గణాంకాలు వ్యవసాయ ఉత్పత్తుల అంచనాలకు ఎంతో కీలకమని తెలిపారు. రైతు సంక్షేమ పథకాలు, పంటల బీమా పరిహారం వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల అమలుకు ఈ గణాంకాలు ఉపయోగపడతాయని వివరించారు. దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ), వ్యవసాయ రంగ అభివృద్ధి, ఆహార ధాన్యాల ఉత్పత్తి అంచనాల్లోనూ వీటి పాత్ర కీలకమని పేర్కొన్నారు.
 
సహాయ వ్యవసాయ సంచాలకులు బత్తుల శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ.. పంట కోత ప్రయోగాలను శాస్త్రీయ పద్ధతిలో, పారదర్శకంగా, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు, పంటల బీమా సంస్థల ప్రతినిధుల పర్యవేక్షణలో ప్రయోగాలు చేపట్టడం ద్వారా ఖచ్చితమైన దిగుబడి వివరాలను నమోదు చేయవచ్చని తెలిపారు.
 
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి కె. దేవదాస్, వ్యవసాయ విస్తరణాధికారులు, ఇన్సూరెన్స్ కంపెనీ సూపర్‌వైజర్ కిరణ్ కుమార్, గ్రామ వ్యవసాయ సహాయకులు సునీలా, ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు.