BREAKING
వైఎస్సార్సిపిలో కార్యకర్తల సంక్షేమానికి తొలి ప్రాధాన్యత 5 న చిల్లర గొల్లపాలెం నందు ఏఎన్‌జీఆర్‌ఏయూ నూతన కేంద్రాల ప్రారంభం పక్షవాతంతో బాధపడుతున్న టీడీపీ కార్యకర్తకు ఎమ్మెల్యే అమిలినేని రూ.50 వేల ఆర్థిక సాయం కుందూ నది వద్ద టాక్టర్, లారీ బోల్తా మున్సిపల్ ఎన్నికల్లో కూటమి విజయమే ధ్యేయం బీటెక్ రవి రూ.3.14 కోట్లతో నిర్మించిన రహదారి ప్రారంభం విట్లంపల్లి ప్రజలకు రోడ్డును అంకితం చేసిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తదుపరి తరం జీఎస్టీ: వికసిత్ భారత్ దిశగా మరో మైలురాయి శ్రీమతి నిర్మల సీతారామన్ హ్యూమా ఖురేషి 'బేబీ డూ డై డూ' రివ్యూ: నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండవుతున్న ఉత్కంఠభరిత క్రైమ్ థ్రిల్లర్ ఎంపీ చెరువులో అభివృద్ధి పరుగులు.. ఎస్ డబ్ల్యూ యూ నూతన యూనియన్ కమిటీ ముంబైకి గుడ్‌బై చెప్పనున్న ప్రముఖ జంట: సొంతూరికి మకాం మార్చనున్న డైరెక్టర్ ఆదిత్య ధర్, యామీ గౌతమ్ వెంకటేష్ చిత్రాల పాటలతో అలరించిన సంగీత సత్సంగం దుక్కి దున్నుతూ ట్రాక్టర్ కిందపడి డ్రైవర్ మృతి. సి.ఎస్.ఐ బేతేలు ఆశ్రమంలో కోడూరి మల్లేశం వర్ధంతి వేడుకలు సోను లేడీస్ ఎంపోరియంలో అనుమతులు లేకుండా ‘Goree Whitening Soap’ విక్రయం

నగరంలోని పార్క్ ల్లో చేస్తున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయండి* జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

Select Suryaa Now
నగరంలోని పార్క్ ల్లో  చేస్తున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయండి*  జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

 

 

కర్నూలు, అక్టోబర్ 03:- నగరంలోని పార్క్ ల్లో  చేస్తున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు..

శనివారం స్థానిక డాక్టర్స్ కాలనీ లోని సంస్కృతి  పార్క్, కిషన్ నగర్ పార్క్, మాధవ్ నగర్ లోని సైన్స్ పార్క్ లలో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో  చేసిన అభివృద్ధి పనులను కలెక్టర్ పరిశీలించారు..

ఈ సందర్భంగా కలెక్టర్  పార్కులను పరిశీలిస్తూ,  అన్ని పార్క్ లలో  బెంచ్ లు, లైటింగ్, వ్యాయామానికి సంబంధించిన పరికరాలు, పిల్లల ఆటలకు సంబంధించిన పరికరాలు  తదితర మౌలిక వసతులను  కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.. నగర ప్రజలకు ఆహ్లాదకరమైన, పరిశుభ్రమైన వాతావరణం కల్పించేలా పార్క్ ల్లో  సుందరీకరణ పనులను చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పచ్చదనం పెరిగే విధంగా  మొక్కలను  పెద్ద ఎత్తున నాటాలన్నారు..ప్రజలు, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, మహిళలు పార్కులను సద్వినియోగం చేసుకునేలా అవసరమైన సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

కార్యక్రమంలో కర్నూలు మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు, కల్లూరు తహసిల్దార్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు..