నామినేషన్లను అడ్డుకోవడం ప్రజాస్వామ్యా నికి విరుద్ధం గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
నరసరావుపేట : స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా కూటమి ప్రభుత్వం అడ్డుకుం టోందని పల్నాడు జిల్లా వైకాపా వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. నర్సాపేట లోని గుంటూరు రోడ్డు లోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పల్నాడు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు వేయనీ యకుండా అధికార పార్టీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడ్డారని విమర్శించారు. వైకాపా నాయకులను గృహనిర్బంధం చేసి, పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. నామినేషన్ల ప్రక్రియలో అధికారులు పక్షపాతంగా వ్యవహరించారని, ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. అధికారులకు భారీ మొత్తంలో డబ్బులు ముట్టాయంటూ ఆరోపణలు చేశారు. నరసరావుపేట ఎంపీకి రాజకీయ భవిష్యత్తు కల్పించింది వైకాపా నేనని, పార్టీ నాయకుల పరిచయాలను ఉపయోగించు కుని రాజకీయాలు చేస్తున్నా రని విమర్శించారు. నరసరావుపేటలో సజావుగా ఎన్నికలు నిర్వహిస్తే వైకాపా విజయం సాధిస్తుందని సవాల్ విసిరారు. 2029లో వైకాపా అధికారంలోకి వస్తే పోటీ లేకుండా ఎన్నికైన ఎంపీటీసీలతో రాజీనా మాలు చేయించి తిరిగి ఎన్నికలకు వెళ్తామని పేర్కొన్నారు.
మల్లికార్జునరావు పల్నాడు జిల్లా ఇన్చార్జి..