BREAKING
టెక్కలి మేజర్ పంచాయతీ సర్పంచ్ బరిలో కోళ్ల లవకుమార్.. పార్టీ కష్టకాలంలో వెన్నంటి నిలిచిన యువనేత ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఏసిపి లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదవాలి ఎస్ ఆర్ కె పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం ధర్మసాగర్ గ్రామపంచాయతీలో చేయూత పెన్షన్ ప్రొసీడింగ్ కాపీలు పంపిణీ ధర్మసాగర్ లో చాచా నెహ్రూ పుట్టినరోజు వేడుకలు ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు కుందారం గ్రామంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు భక్తి పరవశంతో నగర సంకీర్తన ముగిసిన జాతీయ సదస్సు అన్వేషణ సౌత్ జోన్ విజేతగా ఎస్వీయూ బాల్య వివాహాలను అరికడదాం ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంభం బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తాం వికసిత్ భారత్ యువత లక్ష్యం... -ఎస్విసిఈలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికలు

నాగుల చవితి ప్రత్యేకం: పెద్ద శేష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి దర్శనం

Select Suryaa Now
నాగుల చవితి ప్రత్యేకం: పెద్ద శేష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి దర్శనం

తిరుమల :నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం రాత్రి తిరుమలలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు పెద్ద శేష వాహనంపై భక్తులకు కనువిందు చేశారు. రాత్రి 7 గంటల నుండి స్వామి, అమ్మవార్లు నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వగా, పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. సర్పరాజైన ఆదిశేషువు జగన్నాథునికి నివాస భూమిగా, తల్పంగా, సింహాసనంగా సేవలందించినట్లు పురాణాలు చెబుతుండగా, శ్రీవేంకటేశ్వరస్వామి శేషసాయిగా, శేషాద్రి నిలయునిగా నిత్య పూజలు అందుకుంటున్నారు. రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరామునిగా స్వామివారికి అత్యంత సన్నిహితునిగా వ్యవహరించే ఆదిశేషువు శ్రీవైకుంఠంలోని నిత్యసూరులలో ఆద్యుడు కావడంతో, స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి తన ప్రియ భక్తునిపై ఊరేగుతూ శరణాగతి తత్వాన్ని చాటిచెప్పారు. ఈ వాహన సేవలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, తిరుపతి జేఈవో డాక్టర్ శరత్, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో భాస్కర్, వీజీవో సురేంద్ర, పేష్కార్ రామకృష్ణ తదితర అధికారులు పాల్గొన్నారు.