BREAKING
లీజుకు తీసుకున్న బస్సులు అమ్ముకున్నారని ఆరోపణ.. బాధితులకు న్యాయం చేయాలి అంటున్న నల్లి రాజేష్.* అగ్ర హీరోలందరితో స్క్రీన్ షేర్.. కానీ మెగాస్టార్ చిరంజీవితో మాత్రం నటించని స్టార్ హీరోయిన్ కార్మికుల కొరత పరిష్కారానికి లావోస్ తీవ్ర కసరత్తు: స్వర్ణాంధ్ర కాలేజి ని సందర్శించిన నాక్ ఈసీ కమిటీ చైర్మన్ ఆచార్య నాగేశ్వరరావు రూ. 8 కోట్ల రెమ్యునరేషన్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన శ్రీనిధి శెట్టి.. ఏమన్నారంటే? ఉత్తర కొరియా ముప్పుపై దక్షిణ కొరియా, జపాన్ రక్షణ శాఖల కీలక భేటీ: రూ.248 కోట్లతో నర్సీపట్నం మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి! రూ.3 కోట్లతో వాకింగ్ ట్రాక్, కళ్యాణ మండపం పనులకు శ్రీకారం : స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇథియోపియా నేషనల్ ప్యాలెస్, మ్యూజియంను సందర్శించిన విదేశాంగ మంత్రి జైశంకర్ బీసీలకు టీడీపీ అండగా ఉంటుంది బుడా చైర్మన్‌ తెంటు లక్ష్మునాయుడు గురుకుల పాఠశాలలో అంతర్జాతీయ బాలిక దినోత్సవం శీనయ్యకు..జిల్లా పెద్ద బాధ్యతలు..! కోట్యాడ జెడ్పీహెచ్‌ఎస్‌లో ఉపాధ్యాయుడు రంభ వెంకట రమణకు సన్మానం ఉపాధి పనులు వేగవంతం చేయాలి ప్రజాదర్బార్‌కు విశేష స్పందన.. స్వీకరించిన ప్రతి ఫిర్యాదు పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలి -- జెసి కె.ఆర్. కల్పశ్రీ, విప్ నాయకర్

ముస్లిం మైనార్టీలకు రెండు నామినేటెడ్ పదవులు -- ఎమ్మెల్యే బడేటి చంటి హామీ

Select Suryaa Now
ముస్లిం మైనార్టీలకు రెండు నామినేటెడ్ పదవులు  -- ఎమ్మెల్యే బడేటి చంటి హామీ

ఏలూరు, మేజర్ న్యూస్ : బడుగు, బలహీన వర్గాలతో పాటూ ముస్లిం మైనార్టీలకు కూడా కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తూ వారి సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. భవిష్యత్తులో ముస్లిం మైనార్టీలకు రెండు కీలక పదవులను కేటాయించనున్నట్లు ఆయన హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఏలూరు పవర్‌ పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం సందడి వాతావరణం నెలకొంది. కూటమి పాలన పట్ల ఆకర్షితులు కావడంతో పాటూ నిత్యం ప్రజల మధ్యే ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ ప్రభుత్వ పరంగా అన్నివర్గాల వారికి అన్నిరకాల మేళ్ళు అందిస్తున్న పరిపాలనాదక్షుడైన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పనితీరును మెచ్చుకుంటూ ఆయన సమక్షంలో పెద్ద ఎత్తున ముస్లిం మైనార్టీల కుటుంబ సభ్యులు, రజక సంఘం నేతలు, ఇతరులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వక్ఫ్‌ బోర్డు మాజీ ఛైర్మన్‌ రాజా అహ్మద్‌, సుల్తానా బేగం, సోని, లతీఫ్‌, ఇక్బాల్‌, అమీర్‌ జానీ, అజ్మల్‌ షరీఫ్‌, అంజుమన్‌ సెక్రటరీ అష్మల్‌ షరీఫ్‌, గాలీబ్‌, ఫాతిమా, జిల్లా రజక సంఘం నాయకులు ప్రత్తిపాటి రామకృష్ణ, శ్యాంకుమార్‌, కె. శ్రీను, రాజమహేంద్రవరపు బాలు తదితరులు పార్టీలో చేరారు. జిల్లా టీడీపీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వారందరికీ సాదర స్వాగతం పలుకుతూ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యేకు పార్టీలో చేరిన వారందరూ పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాలు కప్పి అభినందనలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ తన భారీ మెజార్టీకి కారణం ప్రజలందరి ఆశీర్వాదాలేనని వ్యాఖ్యానించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా అనేక మంది తనకు అండగా నిలిచారంటూ ఆయన గుర్తుచేశారు. అదే కృతజ్ఞతతో తాను కూడా ప్రజలందరికీ మంచి చేయాలనే సదాలోచనతో ముందుకు కదులుతున్నానని పేర్కొన్న ఎమ్మెల్యే బడేటి చంటి,,, కూటమి ప్రభుత్వం అందిస్తోన్న ప్రతి సంక్షేమ ఫలాన్ని అర్హులకు చేర్చేందుకు తపన కనపరుస్తున్నట్లు వెల్లడించారు. దీనిలో భాగంగానే ఇమామ్‌లు, మౌజమ్‌లకు గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన వేతనాల కంటే అధికంగా ఇస్తూ అండగా నిలిచిన విధానాన్ని వివరించారు. అలాగే ముస్లిం మైనార్టీల సంక్షేమానికి చేపట్టిన చర్యలను ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం మతాలపై, కులాలపై ఏ విధంగా దాడులు చేయించిందో వివరించిన ఎమ్మెల్యే బడేటి చంటి,,, నాటి వైసీపీ నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో నియోజకవర్గంలోని ముస్లింలకు రెండు నామినేటెడ్‌ పదవులు కేటాయించి వారికి సైతం న్యాయం చేస్తానంటూ ఎమ్మెల్యే బడేటి చంటి భరోసా కల్పించారు. పార్టీ పట్ల ఆకర్షితులై పార్టీలో చేరిన వారంతా నిబద్దతతో పనిచేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించేలా కృషిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ పరిశీలకులు మీరావలీ, ఈడా ఛైర్మన్‌ పెద్దిబోయిన శివప్రసాద్‌, ఏఎంసి ఛైర్మన్‌ మామిళ్ళపల్లి పార్థసారధి, మాజీ కో-ఆప్షన్‌ సభ్యులు ఎస్సెమ్మార్‌ పెదబాబు, తెలుగుదేశం పార్టీ జిల్లా మీడియా కో-ఆర్డినేటర్‌ చల్లా వెంకట సత్యవరప్రసాదరావు, నగర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి రెడ్డి నాగరాజు, మాజీ కార్పొరేటర్ మహమ్మద్ ఇలియాస్ పాషా వివిధ హోదాలలో ఉన్న ముస్లిం మైనారిటీ సోదరులు, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 న్యూస్ బ్యూరో బాల సౌరి ఏలూరు