మురమండ కనకదుర్గమ్మ ఆలయంలో వైభవంగా దసరా ఉత్సవాలు ప్రారంభం
కడియం, మేజర్ న్యూస్,కడియం మండలంలోని మురమండ గ్రామ బస్టాండ్ కూడలిలో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 11వ తేదీ తెల్లవారుజామున కోట్ల శ్రీ సూర్యనారాయణ–సునీత దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారి కలశస్థాపన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ పురోహితుడు హెచ్. సూరిబాబు శర్మ శాస్త్రోక్తంగా అమ్మవారికి విశేష పూజలు, అభిషేకాలు జరిపారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు యర్రంశెట్టి వీరబాబు మాట్లాడుతూ గ్రామ పెద్దలు, భక్తుల సహకారంతో దసరా ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ 11న సాయంత్రం దుర్గమ్మ సేవ, అక్టోబర్ 22న గ్రామంలో అమ్మవారి పల్లకీ సేవతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, ఊరేగింపు నిర్వహించనున్నట్లు చెప్పారు. అక్టోబర్ 26న సోమవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో భారీ అన్నసమారాధన ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, నాయకులు ప్రత్తిపాటి రామారావు చౌదరి, గారపాటి వెంకటరమణమూర్తి, వట్టికూటి జానకిరామయ్య, దేవళ్ళ రామ్మోహన్‌రావు, ఈదర దీనదయాళ్, గన్ని పెదబాబి, చినబాబి, మరిడి సత్యనారాయణ, నల్లూరి రామకృష్ణ, ప్రత్తిపాటి వెంకట్రామయ్య చౌదరి, అయినవల్లి త్రిమూర్తులు, చాపా రాంబాబు, ధర్మవరపు శ్రీనివాస్, బుడ్డిగ సూరిబాబు, అయినవల్లి వెంకటేశ్వర్లు, మేకా రామారావు, అంగర రమేష్, యండమూరి వీర ముత్యాలరావు, నాగం గోపి, మిద్దే గోపి, సుబ్బారావు, కోటిపల్లి చంద్ర, వాసం శ్రీనివాస్, అధికారి నగేష్, కోటిపల్లి లక్ష్మణ్ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.