BREAKING
అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ అక్రిడేషన్ కార్డు చూపించినా అడ్డంకులే..! నామినేషన్ కేంద్రాల్లో పాత్రికేయులకు అవమానమా? అనుమతి నిరాకరణపై జర్నలిస్టుల ఆగ్రహం.. అధికారుల తీరుపై నిరసన చేర్యాలలో సమీకృత కార్యాలయ భవనంలో చోరీ.. రూ.4 లక్షల సామాగ్రి అపహరణ నగరం మండలంలో 26 మంది సర్పంచ్, 82 వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలు ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. రైతుల రాస్తారోకో 365బీ జాతీయ రహదారిపై ధర్నా.. నిలిచిపోయిన వాహనాల రాకపోకలు ప్రజల అభిప్రాయం మేరకే తన అడుగులు. యువ నాయకులు గంగుల ఫణి కృష్ణారెడ్డి ఇందిరమ్మ కుటుంబ బీమాను సద్వినియోగం చేసుకోవాలి: చైర్‌పర్సన్ పావని కమ్యూనిటీ హెల్పర్స్ లో భాగంగా పోలీస్ స్టేషన్ సందర్శన ఆడబిడ్డకు అండగా సర్పంచ్ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించడం ప్రతి ఒక్కరి బాధ్యత! న్యాల్కల్ మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ప్రత్యేక శ్రద్ధ చూపాలి సిద్దిపేట జిల్లాకు ‘సురక్షిత్’ గుర్తింపు హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నివారణ, నియంత్రణలో మరో ముందడుగు గవర్నర్‌ను కలిసిన వైసీపీ బృందం.. ఎన్నికల ప్రక్రియపై ఫిర్యాదు రామకృష్ణ పై పీ డి యాక్ట్ నమోదు ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్ చోరీ..... రాష్ట్ర స్థాయి షూటింగ్ పోటీలకు ఎంపికైన న్యూ రిషి పాఠశాల విద్యార్థులు

మంత్రి మండిపల్లికి ఘనస్వాగతం పలికిన శ్రీరామ్ చినబాబు : ఆర్ కన్వెన్షన్‌లో రిషిత,తేజ వివాహ వేడుకకు హాజరు : మున్సిపల్ చైర్మన్ నివాసంలో మర్యాదపూర్వక భేటీ

Select Suryaa Now
మంత్రి మండిపల్లికి ఘనస్వాగతం పలికిన శ్రీరామ్ చినబాబు : ఆర్ కన్వెన్షన్‌లో రిషిత,తేజ వివాహ వేడుకకు హాజరు : మున్సిపల్ చైర్మన్ నివాసంలో మర్యాదపూర్వక భేటీ

మదనపల్లె,మేజర్ న్యూస్ : అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లె పట్టణంలో జరిగిన పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకు రాష్ట్ర రోడ్డు,రవాణా క్రీడలశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి చీకిలబైలు వద్ద రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు,మదనపల్లె మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి శ్రీరామ్ కుమార్ (చినబాబు),ఆయన సోదరుడు దివ్యశ్రీ సిల్క్స్ యజమాని గుండ్లపల్లి యోగేశ్వర బాబు (పెదబాబు),పార్టీ శ్రేణులతో కలిసి ఘనస్వాగతం పలికారు.ఇందులో భాగంగా మంత్రికి పుష్పగుచ్ఛం అందించి ఆత్మీయంగా ఆహ్వానించారు.అనంతరం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి,శ్రీరామ్ చినబాబుతో కలిసి ఆర్ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన నాదెళ్ల రిషిత,తేజ వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.వివాహ వేడుక అనంతరం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శ్రీరామ్ చినబాబు నివాసానికి విచ్చేశారు.ఈ సందర్భంగా చినబాబు కుటుంబ సభ్యులు మంత్రికి ఆత్మీయ స్వాగతం పలికి చైర్మన్ గెలుపు కోసం ప్రత్యేక చొరవ చూపినందుకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ పచ్చిపాల రామకృష్ణ ఆచారి,గంగారపు రామ్మూర్తి నాయుడు,సీడ్ మల్లికార్జున నాయుడు,ప్రభాకర్,రంగస్వామి నాయుడు,టౌన్ బ్యాంకు చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్,నాదెళ్ల శివ,నాగూర్ వలి (షో ఆప్ శీనా),దొరస్వామి నాయుడు,టౌన్ బ్యాంకు డైరెక్టర్ జోలళ్యం దేవేంద్ర (చిన్ని),భాస్కర్,ప్రభు కురబ గౌడ్,పట్టణ అధ్యక్షుడు అరుణ్ తేజ్,సీటీఎం శ్రీనివాసులు,రవి నాయక్,శ్రీకాంత్,కేఎన్ఆర్ తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి