BREAKING
దీక్ష దివస్ కార్యక్రమానికి బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కొత్త ప్రభాకర్‌రెడ్డి చేతుల మీదుగా.. * టీఆర్‌ఆర్‌ఎస్‌ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ.. ఘనంగా పోచమ్మ,ఎల్లమ్మ దేవాలయాల గడప నిర్మాణం కార్యక్రమం లక్షలు వెచ్చించి లక్షణంగా వదిలేశారు...... * సంవత్సరాలు గడుస్తున్న ప్రారంభానికి నోచుకోని హెల్త్ సెంటర్ భవనం బోరు మోటార్, దొంగల అరెస్ట్ మోటార్, కేబుల్ వైర్, పల్సర్ బైక్ స్వాధీనం పలుశుభ కార్యక్రమాలకు హాజరైన గ్రామ సర్పంచ్ బండారి లక్ష్మి & బాలరాజు కరీంనగర్‌లో దీక్షా దివస్ సభకు కదిలిన గుండారెడ్డిపల్లి గులాబీ దండు కోహెడ జూనియర్ క్రికెట్ జట్టుకు ఘన సన్మానం ముద్ర రుణం.. బ్యాంకు వసూళ్ల వేధింపులు! కేసీఆర్ నిరాహార దీక్ష.. తెలంగాణకు విజయదీక్ష! కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కీలక మలుపు! రామానుజ పల్లి సర్పంచ్ గా పొట్టేలి సుధా మరో అవకాశం.. నేడు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అంతరాత్మకు కట్టుబడి నిష్పక్షపాతంగా తీర్పులు వెలువరించాలి కౌంటింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు

మేయర్ ముక్కా శ్రావణిని పరామర్శించిన చిన్న శ్రీను, సిరమ్మ....

Select Suryaa Now
మేయర్ ముక్కా శ్రావణిని పరామర్శించిన చిన్న శ్రీను, సిరమ్మ....

విజయనగరం మేజర్ న్యూస్: గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్  మేయర్ ముక్కా శ్రావణి  తండ్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ముక్కా ముత్యాలనాయుడు  అకాల మరణం పట్ల  అరకు పార్లమెంట్ పరిశీలకులు, ఉమ్మడి విజయనగరం జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) , విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్ మజ్జి సిరి సహస్ర (సిరమ్మ) , ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు  తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు.
శనివారం విశాఖపట్నంలోని ముక్కా శ్రావణి  స్వగృహానికి వెళ్లి ముక్కా ముత్యాలనాయుడు  చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పితృవియోగంతో తీవ్ర దుఃఖంలో ఉన్న మేయర్ ముక్కా శ్రావణి ని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.

ఈ సందర్భంగా మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) మాట్లాడుతూ, పార్టీ ఆవిర్భావం నుంచి ముక్కా ముత్యాలనాయుడు  అందించిన సేవలు ఎనలేనివని, తన కుమార్తె శ్రావణి  మేయర్‌గా బాధ్యతలు చేపట్టే తరుణంలో ఆయన అకస్మాత్తుగా దూరమవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ముత్యాలనాయుడు  పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ క్లిష్ట సమయంలో ముక్కా కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని, మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చోడే వెంకట పట్టాభిరామ్, వర్రి నర్సిమూర్తి,  నెక్కల నాయుడు బాబు, సత్యనారాయణతో పాటు పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.