మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి
జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్
చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్.స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసే వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు అయిన కారణంగా ప్రజలు ఆన్ లైన్ లో ఫిర్యాదుల స్థితిని తెలుసుకోవచ్చని, మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా, లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చునన్నారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి (మీకోసం డాట్ ఏపీ డాట్ జివో వి డాట్ ఇన్) వెబ్సైట్ నందు వారి యొక్క అర్జీల స్థితిని తెలుసుకోవచ్చన్నారు.అలాగే 9552300009 వాట్సాప్ గవర్నెన్స్ నంబర్ ద్వారా ఫిర్యాదుల స్థితిని తెలుసుకోవడానికి ఫీడ్‌బ్యాక్ ఇవ్వడానికి అవకాశం అవకాశం ఉందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యలకు పరిష్కారం పొందాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు