BREAKING
బిగ్ బాస్ తెలుగు 10 నుంచి టెంపర్ వంశీ ఎలిమినేషన్.. 12 వారాలకు రెమ్యునరేషన్ ఎంతంటే డిసెంబర్ 1న వికారాబాద్‌కు తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా రాక అచ్చంపేట ఎస్సీ రిజర్వేషన్ మరో 25 ఏళ్లు కొనసాగించాలి వత్సవాయిలో ప్రారంభమైన రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్ చంద్రారెడ్డి ఇంట విషాదం.. భార్య అనసూయ కన్నుమూత వెల్దుర్తి రాజకీయాల్లో అభివృద్ధి మేనిఫెస్టో హాట్ టాపిక్ ​తాగునీరు, డ్రైనేజీ, రవాణా, ఉపాధికి ప్రాధాన్యత ​మేనిఫెస్టో విడుదల చేసిన మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ మూడు దశాబ్దాలు గడిచిన చెరిగిపోని వైద్య సేవల జ్ఞాపకం జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నాటి ప్రజావాణి రద్దు రీ సర్వే ప్రక్రియలో రైతులు భాగస్వాములై అధికారులకు సహకరించాలి-వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గ్రామాభివృద్ధి నా లక్ష్యం మినీ మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి-మంత్రి సీతక్క కాళోజీ కళాక్షేత్రంలో కవులు కళాకారుల కార్యక్రమాలకు ప్రత్యేక వేదిక ఏర్పాటు మూడు నెలలుగా తాగునీటి సరఫరా బంద్-20వ వార్డు ప్రజల అవస్థలు! వికసిత్ భారత్ నిర్మాణంలో విశ్వ విద్యాలయాలు కీలక పాత్ర పోషించాలి-రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల మృతుని కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి

కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో దారుణం: ప్రసవం తర్వాత కడుపులోనే దూది, కత్తెర.. వైద్యుల తీవ్ర నిర్లక్ష్యంపై బంధువుల ఆగ్రహం!

Select Suryaa Now
 కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో దారుణం: ప్రసవం తర్వాత కడుపులోనే దూది, కత్తెర.. వైద్యుల తీవ్ర నిర్లక్ష్యంపై బంధువుల ఆగ్రహం!

సూర్య బ్యూరో, కాకినాడ: కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (GGH)లో వైద్యుల తీవ్ర నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ప్రసవం కోసం చేరిన ఓ మహిళకు శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు, అనంతరం కడుపులోనే దూది (కాటన్), కత్తెరను వదిలేసి కుట్లు వేసిన అమానవీయ ఘటన తీవ్ర కలకలం రేపింది. ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం ప్రమాదంలో పడటంతో బాధితురాలి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.

ప్రసవానంతరం మహిళ తీవ్రమైన కడుపునొప్పి, తీవ్ర అస్వస్థతతో విలవిల్లాడటంతో కుటుంబ సభ్యులు వైద్యులను సంప్రదించారు. అయితే నొప్పి తగ్గడం లేదని పలుమార్లు విజ్ఞప్తి చేయడంతో స్కానింగ్ పరీక్షలు నిర్వహించగా, కడుపులోనే సర్జికల్ కత్తెర, కాటన్ ఉన్నట్లు గుర్తించి కుటుంబ సభ్యులు విస్తుపోయారు. అత్యవసరంగా మరోసారి శస్త్రచికిత్స చేసి వాటిని బయటకు తీయాల్సి వచ్చింది.

వైద్యుల నిర్లక్ష్యం వల్ల బాధితురాలు ప్రాణాపాయ స్థితికి చేరుకుందని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్లు, సంబంధిత వైద్య సిబ్బందిపై కఠిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆసుపత్రి ఉన్నతాధికారులు స్పందిస్తూ.. సమగ్ర విచారణకు ఆదేశించామని, బాధ్యులైన వారిపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.