BREAKING
దీక్ష దివస్ కార్యక్రమానికి బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కొత్త ప్రభాకర్‌రెడ్డి చేతుల మీదుగా.. * టీఆర్‌ఆర్‌ఎస్‌ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ.. ఘనంగా పోచమ్మ,ఎల్లమ్మ దేవాలయాల గడప నిర్మాణం కార్యక్రమం లక్షలు వెచ్చించి లక్షణంగా వదిలేశారు...... * సంవత్సరాలు గడుస్తున్న ప్రారంభానికి నోచుకోని హెల్త్ సెంటర్ భవనం బోరు మోటార్, దొంగల అరెస్ట్ మోటార్, కేబుల్ వైర్, పల్సర్ బైక్ స్వాధీనం పలుశుభ కార్యక్రమాలకు హాజరైన గ్రామ సర్పంచ్ బండారి లక్ష్మి & బాలరాజు కరీంనగర్‌లో దీక్షా దివస్ సభకు కదిలిన గుండారెడ్డిపల్లి గులాబీ దండు కోహెడ జూనియర్ క్రికెట్ జట్టుకు ఘన సన్మానం ముద్ర రుణం.. బ్యాంకు వసూళ్ల వేధింపులు! కేసీఆర్ నిరాహార దీక్ష.. తెలంగాణకు విజయదీక్ష! కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కీలక మలుపు! రామానుజ పల్లి సర్పంచ్ గా పొట్టేలి సుధా మరో అవకాశం.. నేడు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అంతరాత్మకు కట్టుబడి నిష్పక్షపాతంగా తీర్పులు వెలువరించాలి కౌంటింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు

మహిళలు రుణాలను ఆదాయ వనరులుగా మార్చుకోవాలి

Select Suryaa Now
మహిళలు రుణాలను ఆదాయ వనరులుగా మార్చుకోవాలి

 

ట్రైనీ కలెక్టర్ వెంకటేష్ 

చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్: స్వయం సహాయక సంఘ సభ్యులు తీసుకున్న రుణాలను ఆదాయ వనరులుగా మార్చుకోవాలని ట్రైనీ కలెక్టర్ వెంకటేష్ తెలిపారు. శనివారం ట్రైనీ కలెక్టర్ చిత్తూరు డిఆర్డిఏ పీ డి శ్రీదేవి ఇతర అధికారులతో కలిసి జిల్లాలో డిఆర్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న కార్యక్రమాలపై క్షేత్రస్థాయి పర్యటన చేశారు.యాదమరి బంగారుపాలెం తవణంపల్లి, పెద్దపంజాణి ,శాంతిపురం మండలాల్లో సుడిగాలి పర్యటన చేశారు.ఈ సందర్భంగా యాదమరిలోని బి ఎం సి యు పనితీరు, తవణంపల్లిలోని మహిళా మార్ట్ నిర్వహణ ను పరిశీలించారు.అలాగే పలుచోట్ల సంఘ సభ్యులు రుణాలతో ఏర్పాటు చేసుకున్న యూనిట్లను సైతం తనిఖీ చేసి. వాటి పనితీరు పై ఆరా తీశారు. పలుచోట్ల సంఘ సభ్యులతో సమావేశమైన పలు అంశాలపై సంఘ సభ్యులతో చర్చించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలు సమిష్టిగా ముందుకు సాగితే ఆర్థికంగా మరింత అభివృద్ధి సాధించి వచ్చినని తెలిపారు. తీసుకున్న రుణాలను దుర్వినియోగం చేయకుండా ఆర్థిక వనరులు గా మార్చుకునే విధంగా సద్వినియం చేసుకోవాలన్నారు. రుణాలను ప్రణాళికబద్ధంగా వినియోగించుకుంటే ఆర్థికంగా ప్రయోజనం పొందే అవకాశం ఉందని చెప్పారు.నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని వీటిని సంఘ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా సంఘ సభ్యులు కూడా టెక్నాలజీని అందుపుచ్చుకోవాలని తెలిపారు.తద్వారా తీసుకున్న రుణాలను సులభంగా ఆదాయ వనరులుగా మార్చుకునే అవకాశం ఉంటుందన్నారు. రుణాలు తీసుకోవడంతోనే పరిమితం కాకుండా వాటిని నియమ నిబంధనల మేరకు రీపేమెంట్ చేయాలన్నారు. ప్రతి సంఘ సభ్యురాలికి ఆర్థిక ప్రణాళికలు ఉండాలని అప్పుడే వారు తమ లక్ష్యాలను సాధిస్తారన్నారు. చిత్తూరు జిల్లాలో డిఆర్డిఏ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కార్యక్రమాల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. డిఆర్ఏ పీడీ శ్రీదేవి మాట్లాడుతూ జిల్లాలోని స్వయం సహాయక సంఘాలు పలు అంశాల్లో రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. జిల్లాలో ప్రతి సంఘ మహిళ ఉపాధి పొందేల ప్రోత్సహిస్తున్నామని, ప్రభుత్వ పథకాలు అర్హులైన మహిళలకు చేరవేయడంతో పాటు , సంఘాల ఆర్థిక కార్యక్రమాలు పారదర్శంగా కొనసాగించే విధంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.. ఈ కార్యక్రమంలో డిపిఎంలు రవి, సుబ్బారెడ్డి ,సూరి, పలువురు ఏపీఎంలు , సీసీలు, స్వయం సహాయక సంఘ సభ్యులు పాల్గొన్నారు.

 

ఉమాశంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.