BREAKING
దీక్ష దివస్ కార్యక్రమానికి బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కొత్త ప్రభాకర్‌రెడ్డి చేతుల మీదుగా.. * టీఆర్‌ఆర్‌ఎస్‌ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ.. ఘనంగా పోచమ్మ,ఎల్లమ్మ దేవాలయాల గడప నిర్మాణం కార్యక్రమం లక్షలు వెచ్చించి లక్షణంగా వదిలేశారు...... * సంవత్సరాలు గడుస్తున్న ప్రారంభానికి నోచుకోని హెల్త్ సెంటర్ భవనం బోరు మోటార్, దొంగల అరెస్ట్ మోటార్, కేబుల్ వైర్, పల్సర్ బైక్ స్వాధీనం పలుశుభ కార్యక్రమాలకు హాజరైన గ్రామ సర్పంచ్ బండారి లక్ష్మి & బాలరాజు కరీంనగర్‌లో దీక్షా దివస్ సభకు కదిలిన గుండారెడ్డిపల్లి గులాబీ దండు కోహెడ జూనియర్ క్రికెట్ జట్టుకు ఘన సన్మానం ముద్ర రుణం.. బ్యాంకు వసూళ్ల వేధింపులు! కేసీఆర్ నిరాహార దీక్ష.. తెలంగాణకు విజయదీక్ష! కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కీలక మలుపు! రామానుజ పల్లి సర్పంచ్ గా పొట్టేలి సుధా మరో అవకాశం.. నేడు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అంతరాత్మకు కట్టుబడి నిష్పక్షపాతంగా తీర్పులు వెలువరించాలి కౌంటింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు

మహిళా శక్తే పలాస అభివృద్ధికి పునాది.

Select Suryaa Now
మహిళా శక్తే పలాస అభివృద్ధికి పునాది.

 

మున్సిపల్ చైర్మన్ వజ్జ గంగాభవాని.

పలాస, నవంబర్ 28,మేజర్ న్యూస్.

మహిళా శక్తే పలాస అభివృద్ధికి పునాది అని మున్సిపల్ చైర్మన్ వజ్జ గంగా భవాని అన్నారు.పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం మెప్మా విభాగం ఆధ్వర్యంలో ప్రతినెలా నిర్వహించే టీఎల్ఎఫ్ సమీక్ష సమావేశం శనివారం నిర్వహించారు.ఈ సమావేశంలో పురపాలక చైర్‌పర్సన్ వజ్జ భవాని, ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ వజ్జ బాబూరావు,మున్సిపల్ కమిషనర్ ఈ. శ్రీనివాసులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల అంతర్గత రుణాలు, సంఘాల పనితీరు, సమాఖ్యల కార్యకలాపాలు మరియు మెప్మా ద్వారా అమలవుతున్న వివిధ కార్యక్రమాల పురోగతిపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.రాష్ట్రస్థాయిలో వివిధ అంశాల్లో పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం ముందంజలో ఉండటం పట్ల ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

మహిళలే అభివృద్ధికి కీలకం - భవాని.

ఈ సందర్భంగా చైర్‌పర్సన్ వజ్జ భవాని మాట్లాడుతూ, పట్టణ అభివృద్ధిలో మహిళలు కీలక పాత్ర పోషించాలని, ప్రతి వార్డులోని సమస్యలను నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.మెప్మా విభాగం ద్వారా మహిళా సంఘాలను మరింత బలోపేతం చేస్తూ, అన్ని రంగాల్లో పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షురాలు రాజలక్ష్మి,ఇతర పదాధికారులు,సి.ఎం.ఎం పి.మోహన్,మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.