మదనపల్లెలో దారుణం.. భార్యను బీర్ బాటిల్తో పొడిచి చంపిన భర్త
మదనపల్లెలో దారుణం.. భార్యను బీర్ బాటిల్తో పొడిచి చంపిన భర్త
మదనపల్లె, అన్నమయ్య జిల్లా:
మదనపల్లె పట్టణంలో దారుణ హత్య ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని ఓ లాడ్జిలో బుధవారం అర్ధరాత్రి ఓ వ్యక్తి తన భార్యను బీర్ బాటిల్తో పొడిచి హత్య చేసినట్లు సమాచారం. ఈ ఘటన గురువారం ఉదయం వెలుగులోకి రావడంతో స్థానికంగా కలకలం రేగింది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. భార్య హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణ పూర్తయితే ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.