సివిల్ వివాదాల్లో జోక్యం ఆరోపణలు.. ఘట్కేసర్ సీఐ బాలస్వామి సస్పెన్షన్
ఘట్కేసర్, మేజర్ న్యూస్ (అక్టోబర్ 15): సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఘట్కేసర్ సీఐ ఎం. బాలస్వామి సస్పెన్షన్కు గురైనట్లు సమాచారం. ఈ వ్యవహారంపై అందిన ఫిర్యాదుల మేరకు మల్కాజిగిరి సీఐ సుమతి విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించినట్లు తెలిసింది.సివిల్ వివాదాలకు సంబంధించి సీఐ బాలస్వామిపై పలు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ఈ ఫిర్యాదులపై విచారణ జరిపిన అనంతరం సమర్పించిన నివేదిక ఆధారంగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రి ఆయనను సస్పెండ్ చేసినట్లు సమాచారం. అయితే, ఈ సస్పెన్షన్కు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు, ఆరోపణలపై పోలీసు ఉన్నతాధికారుల వివరణ వెలువడాల్సి ఉంది.
రిపోర్టర్: గుర్రం రమేష్, ఘట్కేసర్, మేడ్చల్ జిల్లా.