BREAKING
బతుకమ్మ సంబరాల్లో బాల్య వివాహాలపై అవగాహన హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ క్యూ2 ఫలితాల సమీక్ష: 24 శాతం వరకు పెరిగే అవకాశం.. నామినేషన్ కేంద్రాల వద్ద, భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్న డి.ఎస్.పి దైవప్రసాద్. జైలర్ 2 విజయంపై కమల్ హాసన్ అభినందనలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ పాలీక్యాబ్ క్యూ2లో రికార్డు స్థాయి ఆదాయం.. అయినా టార్గెట్ ప్రైస్ తగ్గించిన ఐసీఐసీఐ సెక్యూరిటీస్: కారణాలివే! టెండీ లుక్స్‌తో కట్టిపడేస్తున్న శ్రీలీల.. వైరల్ అవుతున్న బ్యూటిఫుల్ ఫోటోషూట్‌ వాలీబాల్‌ విజేత సిర్పూర్‌ యూత్‌ జట్టుకు కిట్‌ అందజేత రేణిగుంట జామ్ జామ్ రెస్టారెంట్‌లో కల్తీ చికెన్ ఫ్రైడ్ రైస్‌ 34 ఏళ్ల వయసులోనూ అంత ఫిట్‌గా ఉండటానికి కారణం అదే.. నటి హన్సిక ఫిట్‌నెస్ సీక్రెట్స్ రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాయామ విద్య ఉపాధ్యాయుడికి గుర్తింపు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మీరా జాస్మిన్ రీఎంట్రీ మరియు మోహన్‌లాల్ చిత్ర విశేషాలు సియట్ నుంచి సైయెంట్ డీఎల్ఎం వరకు: క్యూ2 ఫలితాల తర్వాత 37% వరకు పెరిగే అవకాశం.. టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ రాజీనామా? విప్రో క్యూ2 ఫలితాల సమీక్ష: మార్కెట్ అంచనాలను అందుకున్నా తోటి సంస్థలతో పోలిస్తే వెనుకబాటే.. సిస్టమాటిక్స్ తాజా నివేదిక.. హాస్టల్ భవనాల నుంచి సివిల్ సర్వెంట్లు తయారు కావాలి -మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్

ఎన్ టీ ఆర్ ట్రస్ట్ భరోసా

Select Suryaa Now
ఎన్ టీ ఆర్ ట్రస్ట్ భరోసా

ఏపీ స్టేట్ బ్యూరో, సూర్య ప్రధాన ప్రతినిధి
రక్తదానం కేవలం దానం మాత్రమే కాదని, మరో మనిషి జీవితానికి ఇచ్చే భరోసా అని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. చికిత్స సమయంలో రక్తం అవసరమైన కుటుంబం పడే ఆందోళనను అర్థం చేసుకుని, పేద రోగులకు అండగా నిలవాలనే సంకల్పంతో విజయవాడలో ఆధునిక రక్తనిధి కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విజయవాడలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తలసేమియా కేర్ సెంటర్, రక్తనిధి కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు.ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ... విజయవాడ ప్రజలకు సేవ, నమ్మకం, భరోసాకు చిరునామాగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవనం నిలుస్తుందని చెప్పారు. ఈ రక్తనిధి కేంద్రాన్ని నగర ప్రజలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది కేవలం భవనం మాత్రమే కాదని, పేద రోగుల జీవితాలకు వారధి అని పేర్కొన్నారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. స్వర్గీయ ఎన్టీఆర్‌కు ప్రజలంటే అపారమైన ప్రేమ ఉండేదని, ప్రజల కోసం పనిచేయడమే ఆయన జీవితంలో భాగమని భువనేశ్వరి తెలిపారు. సామాన్యుడి జీవన ప్రమాణాలు మెరుగుపడాలని, సమాజంలోని చివరి వ్యక్తికి సైతం మెరుగైన జీవితం అందాలని ఆయన ఆకాంక్షించేవారని చెప్పారు. ఎన్టీఆర్ ఆలోచనలు, ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్‌ను స్థాపించారని వివరించారు. 29 ఏళ్లుగా ఆరోగ్యం, విద్య, మహిళా సాధికారత, జీవనోపాధి, స్వచ్ఛమైన తాగునీరు తదితర రంగాల్లో ట్రస్ట్ సేవలందిస్తోందన్నారు. ఇన్ని సేవలు చేసినప్పటికీ, ఇంకా చేయాల్సింది ఎంతో ఉందని తాను నమ్ముతున్నట్లు చెప్పారు. మేనేజింగ్ ట్రస్టీగా ఈ సేవా కార్యక్రమాల్లో భాగస్వామిని కావడం తన అదృష్టమన్నారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఏ ఒక్కరికో పరిమితమైన సంస్థ కాదని, సేవ చేయాలనే మనసున్న ప్రతి ఒక్కరిదని పేర్కొన్నారు. ప్రజల నమ్మకంతో నిర్మించిన ఈ సేవా సంస్థలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని కోరారు.

ప్రజల వద్దకే వైద్య సేవలు

ఆరోగ్య రంగంలో ట్రస్ట్ విస్తృతంగా సేవలందిస్తోందని నారా భువనేశ్వరి చెప్పారు. సంజీవని మొబైల్ క్లినిక్స్ ద్వారా ప్రజల వద్దకే వైద్య సేవలను తీసుకెళ్తున్నామని, రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని నియోజకవర్గాల్లో పేదలకు వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఎన్టీఆర్ ఆరోగ్య రథాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా గిరిజన, మారుమూల ప్రాంతాల్లో ఉచితంగా వైద్యం, ఔషధాలు అందిస్తున్నట్లు వివరించారు. ఎన్టీఆర్ సుజల కార్యక్రమం ద్వారా వివిధ ప్రాంతాల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసి స్వచ్ఛమైన తాగు నీటిని అందిస్తున్నామని చెప్పారు. ఎంత మందికి సేవలందించామనేది అంకెల్లో లెక్కించడం కంటే, ప్రజల జీవితాల్లో ఎంతటి మార్పు తీసుకు రాగలిగాం అన్నదే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. విద్య రంగంలోనూ సేవలను విస్తరిస్తున్నామని భువనేశ్వరి తెలిపారు. పేద విద్యార్థులను భవిష్యత్తులో సమాజానికి అవసరమైన వ్యక్తులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. మహిళా సాధికారత కోసం ట్రస్ట్ విస్తృతంగా పని చేస్తోందని, మహిళలకు కేవలం శిక్షణ ఇవ్వడమే కాకుండా కుటుంబానికి అండగా నిలవగలం అనే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్నామని వివరించారు. స్త్రీశక్తి హస్తకళా స్టోర్ ద్వారా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రకృతి విపత్తుల సమయంలోనూ ట్రస్ట్ బాధితులకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. వరదలు, తుఫాన్లతో పాటు కోవిడ్ సమయంలోనూ విస్తృతంగా సేవలు అందించామని చెప్పారు. కష్ట కాలంలో ఒక మనిషికి మరో మనిషి అండగా నిలవాలన్నదే తమ ఆలోచన అని తెలిపారు.

తలసేమియా చిన్నారులకు బాసటగా

తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు నిరంతరం రక్తం అవసరమని, ఈ పరిస్థితి వారి కుటుంబాలకు తీవ్ర ఆందోళన కలిగిస్తుందని భువనేశ్వరి అన్నారు. ఈ సమస్యను అర్థం చేసుకుని గత ఏడాదే తలసేమియా చిన్నారులకు ఉచితంగా రక్తం అందించే కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ప్రారంభించామని తెలిపారు. తలసేమియా కేర్ సెంటర్ ద్వారా ఉచిత రక్త మార్పిడి, అవసరమైన ఫిల్టర్లు, ఔషధాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. త్వరలో విజయవాడలోనూ తలసేమియా కేంద్రాన్ని ప్రారంభిస్తామని మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, రాజమహేంద్రవరంలో ఇప్పటికే రక్తనిధి కేంద్రాలు పనిచేస్తున్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో కీలక కూడలిగా ఉన్న విజయవాడలోనూ ఆధునిక రక్తనిధి కేంద్రాన్ని ప్రారంభించామని తెలిపారు. అత్యవసర సమయాల్లో రక్తం కోసం ఇబ్బందులు పడే రోగులకు ఈ కేంద్రం అండగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రక్తదానం ద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చని భువనేశ్వరి అన్నారు. ప్రతి రక్తదాతా ఒక జీవదాతేనని పేర్కొన్నారు. విజయవాడలో ప్రారంభించిన రక్తనిధి కేంద్రం ద్వారా మరింత మందికి సేవలందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. అనంతపురంలో నెల రోజుల్లో రక్తనిధి కేంద్రాన్ని ప్రారంభించే ఆలోచన ఉందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్‌కు విరాళాలు అందించిన దాతలను, సేవలందించిన వారిని నారా భువనేశ్వరి సత్కరించారు. రక్తదానం, వైద్య సేవల ద్వారా మరింత మంది పేదలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈఓ రాజేంద్ర, సీఓఓ గోపి పాల్గొన్నారు