పట్టణమంతా అమ్మవారి సంబరాలు.. భక్తిభావంతో శరన్నవరాత్రులు శ్రీవాసవి మాత కన్యకా పరమేశ్వరి దేవిని దర్శించుకున్న ఎమ్మెల్యే అంజిబాబు
భీమవరం, సూర్య న్యూస్: పట్టణమంతా అమ్మవారి సంబరాలతో భక్తిభావం ఉట్టిపడుతోందని, భక్తులు విశేష భక్తిశ్రద్ధలతో జరుపుకునే శరన్నవరాత్రులు ప్రత్యేక ఆధ్యాత్మిక వేడుకలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు.భీమవరం త్యాగరాజ భవనంలో ఆర్యవైశ్య యువజన సంఘం, వర్తక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీవాసవి మాత కన్యకా పరమేశ్వరి దేవి 59వ దసరా మహోత్సవాల్లో ఎమ్మెల్యే అంజిబాబు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 58 ఏళ్లుగా సంప్రదాయబద్ధంగా, భక్తిశ్రద్ధలతో అమ్మవారి దసరా మహోత్సవాలను నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.అనంతరం ఎమ్మెల్యే అంజిబాబును సంఘ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య యువజన సంఘం, వర్తక సంఘం ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.
రిపోర్టర్ శ్రీనివాస్ భీమవరం పశ్చిమగోదావరి జిల్లా,