ఓటీటీలోకి హాలీవుడ్ బ్లాక్బస్టర్ హారర్ చిత్రం అబ్సెషన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సూర్య ఎంటర్టైన్మెంట్ డెస్క్: హాలీవుడ్ తెరపై అత్యంత భారీ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించిన క్రైమ్ హారర్ థ్రిల్లర్ చిత్రం అబ్సెషన్ డిజిటల్ వేదికగా భారతీయ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఎలాంటి భారీ అంచనాలు లేకుండా తక్కువ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో కాసుల వర్షం కురిపించింది. కర్రీ బార్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మైఖేల్ జాన్సన్ మరియు ఇండే నవారెట్ ప్రధాన పాత్రల్లో నటించి అద్భుతమైన అభినానంతో ప్రేక్షకులను కట్టిపడేశారు. థియేటర్లలో రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకెళ్లిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రిమియర్కు రానుండటంతో సినీ ప్రియుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.
ఈ చిత్రానికి సంబంధించి ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫామ్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అబ్సెషన్ సినిమా ఒరిజినల్ అన్కట్ వెర్షన్ జియోహాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. అక్టోబర్ 30వ తేదీ సాయంత్రం ఏడు గంటల నుంచి ఈ చిత్రం డిజిటల్ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఎలాంటి కోతలు లేకుండా పూర్తిగా ఒరిజినల్ అన్కట్ వెర్షన్ను ప్రేక్షకులకు అందిస్తుండటంతో, హారర్ మరియు థ్రిల్లర్ జానర్ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఒక సాధారణ కోరిక మనిషి జీవితాన్ని ఎంతటి భయానక మలుపు తిప్పుతుందనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. చిత్రంలో ప్రధాన పాత్రధారులు నటించిన తీరు మరియు ఉత్కంఠభరితమైన సన్నివేశాలు ప్రేక్షకులను భయపెట్టడంతో పాటు ఆలోచింపజేసేలా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి వసూళ్లను సాధించిన ఈ చిత్రం, డిజిటల్ వేదికపై ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
హాలీవుడ్లో సంచలనం సృష్టించిన ఈ హారర్ థ్రిల్లర్ చిత్రం త్వరలోనే ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుండటంతో సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన చర్చ జోరుగా సాగుతోంది. రాబోయే హాలోవీన్ పండుగ సందర్భంగా థ్రిల్లర్ సినిమాలను చూడాలనుకునేవారికి ఈ సినిమా సరికొత్త అనుభూతిని పంచుతుందని చెప్పవచ్చు. డిజిటల్ మాధ్యమాలలో అబ్సెషన్ అన్కట్ వెర్షన్ దూసుకెళ్లేందుకు సర్వం సిద్ధమైంది.
Also Read: నార్నియా ది మెజీషియన్స్ నెఫ్యూ ట్రైలర్ విడుదల.. అద్భుత ప్రపంచంలోకి తీసుకెళ్లే మాయాజాలం