BREAKING
హాలీవుడ్‌లో ఘనంగా అడుగుపెట్టిన విద్యుత్ జమ్వాల్.. స్ట్రీట్ ఫైటర్ మూవీ రివ్యూ *కాంగ్రెస్ అసమర్థ పాలన వల్లనే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం* అయ్యప్ప నామస్మరణతో శబరిమలకు మహా పాదయాత్ర: అయిజ కౌన్సిలర్ ఏ. శివ స్వామికి ఘన వీడ్కోలు! ఓటీటీలోకి హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ హారర్ చిత్రం అబ్‌సెషన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? ఏపీలో హై టెన్షన్: టీడీపీ, వైసీపీ నేతల మధ్య రాళ్ల దాడి.. ఎంపీ మిథున్ రెడ్డి కారు ధ్వంసం! నార్నియా ది మెజీషియన్స్ నెఫ్యూ ట్రైలర్ విడుదల.. అద్భుత ప్రపంచంలోకి తీసుకెళ్లే మాయాజాలం బతుకమ్మ సంబరాల్లో బాల్య వివాహాలపై అవగాహన హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ క్యూ2 ఫలితాల సమీక్ష: 24 శాతం వరకు పెరిగే అవకాశం.. నామినేషన్ కేంద్రాల వద్ద, భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్న డి.ఎస్.పి దైవప్రసాద్. జైలర్ 2 విజయంపై కమల్ హాసన్ అభినందనలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ పాలీక్యాబ్ క్యూ2లో రికార్డు స్థాయి ఆదాయం.. అయినా టార్గెట్ ప్రైస్ తగ్గించిన ఐసీఐసీఐ సెక్యూరిటీస్: కారణాలివే! టెండీ లుక్స్‌తో కట్టిపడేస్తున్న శ్రీలీల.. వైరల్ అవుతున్న బ్యూటిఫుల్ ఫోటోషూట్‌ వాలీబాల్‌ విజేత సిర్పూర్‌ యూత్‌ జట్టుకు కిట్‌ అందజేత రేణిగుంట జామ్ జామ్ రెస్టారెంట్‌లో కల్తీ చికెన్ ఫ్రైడ్ రైస్‌ 34 ఏళ్ల వయసులోనూ అంత ఫిట్‌గా ఉండటానికి కారణం అదే.. నటి హన్సిక ఫిట్‌నెస్ సీక్రెట్స్

సరస్వతీ దేవి అలంకారంలో గంగానమ్మ అమ్మవారు

Select Suryaa Now
సరస్వతీ దేవి అలంకారంలో గంగానమ్మ అమ్మవారు

జంగారెడ్డిగూడెం-మేజర్ న్యూస్ పట్టణంలో కొలువై ఉన్న గ్రామదేవత శ్రీ శ్రీ శ్రీ గంగానమ్మ అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజు శుక్రవారం అమ్మవారు శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 7 గంటల నుంచి ఆలయ ప్రాంగణంలో 600 మంది చిన్నారులతో సామూహిక సరస్వతీ పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు.ప్రధాన పూజల్లో బంగారు సూర్యనారాయణ, రాజాన సత్యనారాయణ, మాడా గణేష్, రామకృష్ణ మెడికల్స్ చైతన్య దంపతులు, విద్యావికాస్ విద్యాసంస్థల కుటుంబ సభ్యులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అమ్మవారి అలంకరణ నిమిత్తం స్వర్ణ మందిర్‌కు చెందిన కందులపాటి శ్రీనివాసరావు దంపతులు చీరను సమర్పించారు. ఉదయం ప్రసాదాన్ని అభిలాష్ రెడ్డి, లక్ష్మి, త్రివేణిరెడ్డి కుమార్తె అన్యారెడ్డి, భరత్ రెడ్డి–సాయిలక్ష్మి దంపతులు అందించగా, సాయంత్రం ప్రసాదాన్ని వెంకట సాయి దుర్గా బుక్స్ అండ్ స్టేషనరీ, మేడిచెర్ల రామకృష్ణ సమకూర్చారు.

వేకువజాము నుంచే భక్తులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. సిటీకేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్, ఆర్డీఓ ఎం.వి. రమణ, పట్టణ సీఐ ఎం.వి. సుభాష్ తదితర ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

 

 రిపోర్టర్ కెవి రమణ రావు జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా