మున్సిపల్ చైర్ పర్సన్ స్థానాన్ని టిడిపికి కేటాయించాలంటూ నిరసన
తాడేపల్లిగూడెం, సూర్య న్యూస్; ఎన్నికల నగారా మోగగానే రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నిరసన సెగలు మొదలయ్యాయి. కూటమి పార్టీ కి, ముఖ్యంగా టిడిపి కి ఈ సగ ప్రభావం ఎక్కువగా కనబడుతుంది. ఏలూరులో మాకుమ్మడి రాజీనామాలకు తెరలేపిన తెలుగు తమ్ముళ్లు ఆగ్రహ జ్వాలలు ఆరకముందే తాడేపల్లిగూడెం లో తెలుగు తమ్ముళ్లు నిరసన గళం విప్పారు. తమకు న్యాయం చేయాలంటూ లేని పక్షంలో మూకమ్మడి రాజీనామాలకు సిద్ధమంటూ పలువురు నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తపరిచారు. ఎంతోకాలంగా బీసీ నాయకులు చైర్మన్ పదవి కోసం ఎదురుచూస్తున్న తరుణంలో మళ్లీ జనరల్ కావడం, ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించడంతో తెలుగు తమ్ముళ్లు నిరసనగళం వినిపిస్తున్నారు.
రిపోర్టర్ శ్రీనివాస్, తాడేపల్లిగూడెం పశ్చిమగోదావరి జిల్లా