ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందాలి..ఎమ్మెల్యే పాయం
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందాలి.. ఎమ్మెల్యే పాయం
మణుగూరు ఆర్ సి సూర్య(మేజర్ న్యూస్);ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతీ ఒక్కరికీ అందాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు.శనివారం మణుగూరు మున్సిపాలిటీలోని శేషగిరి నగర్ లో పర్యటించి అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్రాగునీరు, రహదారులు,డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. సంక్షేమ పథకాలు అందున్నాయా లేదా అని నేరుగా లబ్ధిదారుల దగ్గరకు వెళ్లి అడిగి తెలుసుకున్నారు. అధికారులు అలసత్వం వహించకుండా పనిచేయాలని సూచించారు.