BREAKING
అపరిశుభ్రత కు నిలయంగా మారిన మహిళా సమాఖ్య భవన ప్రాంగణం… భక్తిభావంతో దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన శంభీపూర్ క్రిష్ణ అంబరాన్నంటిన బతుకమ్మ వేడుకలు *ఉత్సాహంగా ఆడిపాడిన మహిళలు చండీ హోమంలో పాల్గొన్న కాంగ్రెస్ నేత కూన శ్రీనివాస్ గౌడ్ 50వ వార్డు టిడిపి అభ్యర్థిగా నరవ పంకజ్ కుమార్ నామినేషన్ సివిల్ జడ్జిగా ఎంపికైన శ్రీవల్లి నిజాంపేట్ కనకదుర్గమ్మ ఆలయంలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు లక్ష గాజులతో గజలక్ష్మిగా అలంకరించుకున్న కనకమహాలక్ష్మి! కనకదుర్గాదేవిగా దుర్గమ్మ దుర్గమ్మ ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి : ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ 54 వ వార్డు వైసిపి అభ్యర్థిగా బాణాల శ్రీనివాసరావు నామినేషన్ చెన్నైలో దంచికొడుతున్న వర్షాలు.. అధికారులను అప్రమత్తం చేసిన సీఎం విజయ్ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న సబిహాగౌసుద్దీన్‌ జీటీఎస్‌ దేవస్థానంలో ఘనంగా దుర్గాష్టమి పూజలు 17 వ వార్డు వైసిపి అభ్యర్థి నల్ల రవి నామినేషన్

జనసేనలో చేరిన మునిగంటి కనకదుర్గ

Select Suryaa Now
జనసేనలో చేరిన మునిగంటి కనకదుర్గ

 

--జనసేనలో చేరిన మునిగంటి కనకదుర్గ 

ఖమ్మం, సూర్య (మేజర్ న్యూస్):
నిత్యం ప్రజా సేవలో ఉంటూ తనదైన శైలిలో ప్రజలకు దగ్గరవుతూ అందరికీ తలలో నాలుకల ఉంటూ అన్ని పార్టీలతో సంబంధాలు కలిగిన ప్రజా సేవకురాలు మునిగంటి కనకదుర్గ హైదరాబాద్ లోని తన నివాసం నందు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. గతంలో అనేక సేవా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించి ప్రజలతో నిత్యం మమేకమవుతూ ప్రజా సమస్యల పట్ల సమగ్ర అవగాహన కలిగి వాటి పరిష్కార దిశగా పనిచేసిన కనకదుర్గ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీ ద్వారా ప్రజలకు మరింత దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో 2008 ప్రజారాజ్యం పార్టీ ద్వారా ప్రజాప్రస్థానం మొదలుపెట్టి జిల్లా అధికార ప్రతినిధిగా బాధ్యతలను నిర్వహించారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా మరియు రచ్చబండ సభ్యురాలిగా వివిధ రకాల హోదాల్లో పనిచేశారు. రాహుల్ గాంధీ ఫౌండేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మరియు తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా సామాజిక న్యాయం అందరికీ అందాలని తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఆదేస్పూర్తితో కెసిఆర్ ఫౌండేషన్ స్థాపించి వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ముఖ్యంగా ఖమ్మం పట్టణంలో వివిధ డివిజన్లో కేసీఆర్ ఫౌండేషన్ ద్వారా ఇంచార్జీలను నియమించి ప్రజా సమస్యల పట్ల అవగాహన కల్పించారు వాటిని పరిష్కరించే దిశగా ఉద్యమించారు. వివిధ ప్రజా సంక్షేమ కార్యక్రమాల పట్ల అవగాహన కార్యక్రమాలు కేసీఆర్ ఫౌండేషన్ ద్వారా నిర్వహించారు.  రాజకీయాలతో పాటు విద్యను కొనసాగిస్తూ కష్టపడి చదువుకొని జిల్లా  హైకోర్టు న్యాయవాదిగా  పనిచేస్తున్నారు. గత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 46 డివిజన్ లో కార్పొరేట్ అభ్యర్థిగా ప్రయత్నించారు. పదవులు ఆశించకుండా ప్రజల సంక్షేమమే పరమావిధిగా భావించి రాజకీయాల్లో నిలిచారు. అజాత శత్రువుగా పేరుగాంచిన తనతో పాటు నలుగురు ఎదగాలి అన్న ఆలోచన కలిగిన కనకదుర్గ అందరికీ ఆదర్శంగా నిలిచారు. పవన్ కల్యాణ్  ఆశయాలు మరియు ఆయన పని విధానం నచ్చి యువత పట్ల ఆయన చూపిస్తున్న మక్కువ చూసి ప్రజలకు నిజమైన పరిపాలన ఫలాలను అందించాలని జనసేన లో చేరినట్లు తెలిపారు.