BREAKING
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి విజయదశమి వేళ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం విజయవాడలో కూటమి సమష్టి కార్యాచరణ.. - అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ గెలుపునకు ప్రత్యేక వ్యూహం మహర్నవమి వేడుకల్లో ఆయుధ పూజలు.. - పోలీస్‌ కమిషనర్‌ దంపతుల ప్రత్యేక పూజలు 76వ డివిజన్‌లో గాదిరాజు శ్రీనివాసరాజుకు మద్దతుగా బొండా ఉమా ప్రచారం కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా ఉయ్యూరు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సంక్షేమమే ధ్యేయం మచిలీపట్నం అభివృద్ధే నా ధ్యేయం : కూటమి మేయర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదా స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి స్థానిక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ దసరా మెగా కార్నివాల్‌.. విజయవాడలో ట్రాఫిక్‌ మళ్లింపులు విజయవాడ ఉత్సవ్ 2.0లో ‘క్యాస్ట్’ చిత్ర బృందం సందడి నేటి పంచాంగం 20 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –20 అక్టోబర్ 2026 శ్రీవారి అలంకరణలో కదిరి నరసింహ స్వామి

నిజాంపేట్ కనకదుర్గమ్మ ఆలయంలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు

Select Suryaa Now
నిజాంపేట్ కనకదుర్గమ్మ ఆలయంలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు

నిజాంపేట్ మేజర్ న్యూస్ :నిజాంపేట్‌లోని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఆలయ ధర్మకర్త కొలన్ శ్రీనివాస్ రెడ్డి, నాయకుడు కొలన్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు అమ్మవారు శ్రీ కనకదుర్గమ్మ స్వరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. 

సుందరంగా అలంకరించిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాద కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. 

అమ్మవారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని, అందరూ సుఖసంతోషాలతో జీవించాలని భక్తులు ప్రార్థించారు. ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ గ్రామ పెద్దలు, గ్రామస్తులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారి సేవలో తరించారు.