వెల్దుర్తి మండల ఎంపీపీ వైకాపా అభ్యర్థిగా ముత్యాల దేవరాజు బలపరిచిన మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి
వెల్దుర్తి, సూర్య ప్రతినిధి వెల్దుర్తి రూలర్ .పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండల వైకాపా ఎంపీపీ అభ్యర్థిగా ముత్యాల దేవరాజు పేరును ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి బలపరిచారు. ఈ మేరకు మండల వైకాపా నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఆయన పేరును ఖరారు చేస్తూ మద్దతు ప్రకటించారు.
ముత్యాల దేవరాజు రాజకీయ నేపథ్యం:
వెల్దుర్తి పట్టణానికి చెందిన ముత్యాల దేవరాజు స్థానికంగా వైకాపా పార్టీ పటిష్టతకు విశేషంగా కృషి చేస్తున్నారు.వైకాపా ప్రభుత్వ హయాంలో ఆయన సతీమణి ముత్యాల శైలజ వెల్దుర్తి సర్పంచ్గా బాధ్యతలు నిర్వర్తించి, స్థానిక ప్రజలకు మెరుగైన సేవలు అందించారు.పార్టీ కోసం వారు చేసిన సేవలను గుర్తించిన మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, ఎంపీపీ అభ్యర్థిగా ముత్యాల దేవరాజు వైపు మొగ్గు చూపారు.ఈ కార్యక్రమంలో స్థానిక వైకాపా నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ముత్యాల దేవరాజుకు శుభాకాంక్షలు తెలిపారు.
సూర్య ప్రతినిధి కే రాజశేఖర్ కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం