BREAKING
అంబరాన్నంటిన బతుకమ్మ వేడుకలు *ఉత్సాహంగా ఆడిపాడిన మహిళలు చండీ హోమంలో పాల్గొన్న కాంగ్రెస్ నేత కూన శ్రీనివాస్ గౌడ్ 50వ వార్డు టిడిపి అభ్యర్థిగా నరవ పంకజ్ కుమార్ నామినేషన్ సివిల్ జడ్జిగా ఎంపికైన శ్రీవల్లి నిజాంపేట్ కనకదుర్గమ్మ ఆలయంలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు లక్ష గాజులతో గజలక్ష్మిగా అలంకరించుకున్న కనకమహాలక్ష్మి! కనకదుర్గాదేవిగా దుర్గమ్మ దుర్గమ్మ ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి : ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ 54 వ వార్డు వైసిపి అభ్యర్థిగా బాణాల శ్రీనివాసరావు నామినేషన్ చెన్నైలో దంచికొడుతున్న వర్షాలు.. అధికారులను అప్రమత్తం చేసిన సీఎం విజయ్ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న సబిహాగౌసుద్దీన్‌ జీటీఎస్‌ దేవస్థానంలో ఘనంగా దుర్గాష్టమి పూజలు 17 వ వార్డు వైసిపి అభ్యర్థి నల్ల రవి నామినేషన్ దుర్గా దేవి ప్రతిరూపం బాల కన్యలు .. వానలో జోరుగా ఎన్నికల ప్రచారం 49 వ వార్డు వైసిపి అభ్యర్థి బొడ్డేటి మాధవి కిరణ్

పట్టభద్రుల ఓటు నమోదుకు కాంగ్రెస్ గడపగడపకు ప్రచారం

Select Suryaa Now
పట్టభద్రుల ఓటు నమోదుకు కాంగ్రెస్ గడపగడపకు ప్రచారం

పట్టభద్రుల ఓటు నమోదుకు కాంగ్రెస్ గడపగడపకు ప్రచారం

చేర్యాల : వరంగల్‌–నల్గొండ–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదును వేగవంతం చేయడంపై కాంగ్రెస్ నాయకులు దృష్టి సారించారు. జనగామ నియోజకవర్గ ఇన్‌చార్జి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఆదేశాలు, చేర్యాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంజె మల్లేశం సూచనల మేరకు ఆకునూరు గ్రామంలో శనివారం గడపగడపకు వెళ్లి పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించారు.గ్రామ శాఖ అధ్యక్షుడు ఆకుల రాజు గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అందె నానిబాబు, సీనియర్ నాయకుడు రణం శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు పెద్ద ముత్తుని పోశయ్య, యూత్ అధ్యక్షుడు ఉడుత బాలరాజు, సోషల్ మీడియా అధ్యక్షుడు అనుముల రాజశేఖర్, ఉపసర్పంచ్ కడారి పల్లవి- భాస్కర్, వార్డు సభ్యులు సూర అనిత, సంపత్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు తోళ్ళ వేణు, తాటికొండ సుభాష్, నీలా నరేష్, కడారి నరేష్, ఉల్లెంగల రాజశేఖర్, రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.