శాలిగౌరారం మహిళా ఉద్యోగుల బతుకమ్మకు ద్వితీయ బహుమతి.*
*సూర్య,శాలిగౌరారం*
నల్గొండ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆయా మండలాల మహిళా ఉద్యోగులకు బతుకమ్మ పోటీలను నిర్వహించారు.శాలిగౌరారం మహిళ ఉద్యోగులు అలంకరించిన బతుకమ్మ ద్వితీయ బహుమతి సాధించింది.శుక్రవారం రాత్రి నల్గొండ లోని ఆర్డిఓ కార్యాలయంలో నిర్వహించిన బహుమతుల కార్యక్రమంలో ఆర్డీవో వై అశోక్ రెడ్డి చేతుల మీదుగా శాలిగౌరారం మహిళా ఉద్యోగులు ద్వితీయ బహుమతిని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ మొగిలి విజయ్ శేఖర్,వంటెపాక రాంబాబు,మహిళా ఉద్యోగులు జ్యోతి,పద్మ,శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్:
ఆర్డివో అశోక్ రెడ్డి చేతుల మీదుగా ద్వితీయ బహుమతిని అందుకుంటున్న శాలిగౌరారం మహిళ ఉద్యోగులు..