పెనుగంచిప్రోలు దేవస్థానం ఆధ్వర్యంలో దుర్గమ్మకు సారె సమర్పణ
ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం మధ్యాహ్నం ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మవారికి పెనుగంచిప్రోలు దేవస్థానం అధికారులు, పాలకమండలి సభ్యులు సారె సమర్పించారు. ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రి దేవస్థానం అధికారులు వారికి స్వాగతం పలికారు. అమ్మవారికి సారె సమర్పించిన అనంతరం వేద పండితులు పెనుగంచిప్రోలు దేవస్థానం అధికారులు, పాలకమండలి సభ్యులకు వేద ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) వారికి అమ్మవారి చిత్రపటంతో పాటు ప్రసాదాలను అందజేశారు.