గుత్తి మున్సిపల్ టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా గోవింద రాజులు తమిళ్ సెల్వి
గుత్తి (గుత్తి మేజర్ న్యూస్) : గుత్తి మున్సిపాలిటీ చైర్మన్ పదవికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గోవింద రాజులు తమిళ్ సెల్వి పేరును ఖరారు చేసినట్లు సమాచారం. అభ్యర్థి ఎంపికతో గుత్తి మున్సిపల్ రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది.
మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే దిశగా తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యూహాలకు పదును పెడుతున్నారు. పార్టీ అభ్యర్థిగా తమిళ్ సెల్వి పేరు తెరపైకి రావడంతో స్థానికంగా రాజకీయ చర్చ మొదలైంది. చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదుపరి పరిణామాలపై దృష్టి సారించారు.
రిపోర్టర్ : శేఖర్ గౌడ్, గుత్తి ఇంచార్జ్, గుత్తి.