ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
సూర్య,ఇల్లందు,స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం నాడు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్ టెంకాయ కొట్టి బతుకమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆసుపత్రి సిబ్బంది తో ఆర్ఎంఓ డాక్టర్ హర్షవర్ధన్ బతుకమ్మ ఆడారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన బతుకమ్మ వేడుకలను నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని, అంతేకాకుండా బతుకమ్మ పండుగ ఆడబిడ్డల ఆత్మగౌరవమని అన్నారు.
సూర్య రిపోర్టర్ రాజేష్ ఇల్లందు