టీటీడీ ఆధ్వర్యంలో దుర్గమ్మకు సారె సమర్పణ
ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరఫున శనివారం మధ్యాహ్నం ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మవారికి సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తలు జాస్తి సాంబశివరావు, నన్నపనేని సదాశివరావు, ఆలయ సూపరింటెండెంట్ సూర్యనారాయణతో పాటు టీటీడీ సిబ్బంది పాల్గొని అమ్మవారికి సారె సమర్పించారు. అనంతరం ఆశీర్వచన మండపంలో వేద పండితులు వారికి వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) అమ్మవారి చిత్రపటంతో పాటు ప్రసాదాలను వారికి అందజేశారు.