BREAKING
80 శాతం రాయితీతో ఉద్యాన పంటలకు నీటి సరఫరా ఎమ్మిగనూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా మాచాని సునీత ఖరారు జనగణన 2027 ఫేజ్ -2 శిక్షణా కార్యక్రమం..జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాస్ ప్రజల సుఖసంతోషాలు, రైతుల సుభిక్షం కోసం లక్ష పుష్పార్చన. 56వ డివిజన్ వైకాపా అభ్యర్థిగా గోపి జీవితంలో వంద శాతం విజయం సాధించాలంటే ఈ లక్షణాలు తప్పనిసరి: ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు ఎలికట్ట అంబా భవానీ మాత ఆలయంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ప్రత్యేక పూజలు.. దుర్గామాత ఆశీస్సులతో గని కార్మికులు, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి: మేయర్‌ దర్ని మధుకర్‌ విశాఖ కనకమహాలక్ష్మి దేవస్థానం ఆధ్వర్యంలో దుర్గమ్మకు సారె సమర్పణ రణబాలి షూటింగ్ జ్ఞాపకాలను పంచుకున్న రష్మిక మందన్న: తెరవెనుక ఆసక్తికర విశేషాలు వైరల్! 39 వ వార్డు తెదేపా అభ్యర్థి గా సాకే జయప్ప పెనుగంచిప్రోలు దేవస్థానం ఆధ్వర్యంలో దుర్గమ్మకు సారె సమర్పణ గుత్తి మున్సిపల్ టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా గోవింద రాజులు తమిళ్ సెల్వి అనంతపురం స్వతంత్ర అభ్యర్థిగా మాల ఉమేష్ అందాల ఆరబోతతో మంత్రముగ్ధులను చేస్తున్న తమన్నా భాటియా: లేటెస్ట్ ఫొటోషూట్ వైరల్!

ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు కాదు.. కల్వకుంట్ల కుటుంబం తెచ్చిన కరువు! బీఆర్ఎస్ పాలనలో బాగుపడింది కల్వకుంట్ల కుటుంబమే: ప్రభుత్వ విప్ డాక్టర్ బాల్మూర్ వెంకట్

Select Suryaa Now
ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు కాదు.. కల్వకుంట్ల కుటుంబం తెచ్చిన కరువు!                                     బీఆర్ఎస్ పాలనలో బాగుపడింది కల్వకుంట్ల కుటుంబమే: ప్రభుత్వ విప్ డాక్టర్ బాల్మూర్ వెంకట్

తెలంగాణ బ్యూరోప్రతినిధి :  తెలంగాణలో నెలకొన్న కరువు పరిస్థితులకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమన్న బీఆర్ఎస్ నేతల విమర్శలను ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ డాక్టర్ బాల్మూర్ వెంకట్ తీవ్రంగా ఖండించారు. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు కాదని, కల్వకుంట్ల కుటుంబం పదేళ్ల పాలనలో చేసిన తప్పిదాల ఫలితమని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో నీళ్లు, నిధులు, నియామకాలు ప్రధాన నినాదాలుగా నిలిచాయని, అయితే కేసీఆర్ ఆ లక్ష్యాలను తన కుటుంబ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లను తన ఫామ్‌హౌస్‌కు మళ్లించుకున్నారని, నియామకాల్లో కుటుంబ సభ్యులు, బంధువులకు ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు. ప్రభుత్వ ఖజానా ఖాళీ కాగా, బీఆర్ఎస్ ఖాతాలు మాత్రం విరాళాలతో నిండాయని ఆరోపించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిధులను దారి మళ్లించుకోవడం, భూములు, వ్యాపారాలను పెంచుకోవడంపైనే గత పాలకులు దృష్టి పెట్టారని అన్నారు. తెలంగాణ కోసం అన్ని వర్గాల ప్రజలు పోరాడితే, ప్రయోజనం మాత్రం కల్వకుంట్ల కుటుంబానికే దక్కిందని మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం గురించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో, తెలంగాణలో కరువు పరిస్థితులకు ప్రస్తుత ప్రభుత్వమే కారణమన్నట్లు బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం అవివేకమని విమర్శించారు . హరీశ్‌రావు చేపట్టిన ధర్నా రైతుల ప్రయోజనాల కోసం కాదని, తన మామ ఫామ్‌హౌస్‌కు నీళ్లు అందించాలనే ఉద్దేశంతోనేనని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిపుణుల సలహాలతో నిర్మించి ఉంటే ప్రస్తుత కష్టకాలంలో ప్రజలకు ఉపయోగపడేదని పేర్కొన్నారు. గత పదేళ్ల పాలనలో చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకుంటూ ప్రజా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎన్ని విమర్శలు చేసినా గత పాలనలో వాస్తవంగా ఏం జరిగిందో ప్రజలకు తెలుసని డాక్టర్ బాల్మూర్ వెంకట్ స్పష్టం చేశారు.