BREAKING
పశువుల నీటి తొట్టెలు, కమ్యూనిటీ ఇంకుడు గుంతల నిర్మాణానికి తక్షణ చర్యలు చేపట్టాలి - జిల్లా కలెక్టర్ రాజర్షి షా చట్టబద్ధమైన పాలనతోనే అభివృద్ధి సాధించాం: సీఎం యోగి ఆదిత్యనాథ్! రాజకీయ పార్టీలు ఎన్నికలు నిర్వహణకు సహకరించాలి :మండల రిటర్నింగ్ అధికారి సత్యనారాయణ నఅన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో అత్యవసర సమావేశం చలో ఇంద్రవెల్లి కార్యక్రమ పోస్టర్, ఆహ్వాన పత్రాల విడుదల ఒడిశా విద్యార్థి యూనియన్ ఎన్నికల్లో ఎబివిపి ఘనవిజయం యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉటూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలి హెడ్డింగ్;మద్యం విక్రయాలు ప్రభుత్వ నిబంధనలు ప్రకారం జరపాలి . చింతలపూడి ఎక్సైజ్ సి ఐ పి అశోక్. బెల్టు షాపులు నిర్మూలించాలని పాలకవర్గ సభ్యుల వినతి జమ్ముకశ్మీర్‌లో రైల్, రోడ్డు, ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టులతో ఘనమైన పురోగతి! దుర్గామాత వద్ద కళాకారుల బృందం ప్రదర్శన బతుకమ్మ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలి రూ. లక్ష విరాళం అందించిన సమ్మెట కోటేశ్వరరావు కుష్టు వ్యాధి నిర్ధారణకు ఈనెల 22 నుండి స్పెషల్ డ్రైవ్ - మండల వైద్యాధికారి శివాలయంలో వైభవంగా కుంకుమ పూజలు శ్రీ మహాలక్ష్మీ దేవి అవతారంలో దర్శనమిచ్చిన విశాలాక్షి అమ్మవారు

అయ్యప్ప నామస్మరణతో శబరిమలకు మహా పాదయాత్ర: అయిజ కౌన్సిలర్ ఏ. శివ స్వామికి ఘన వీడ్కోలు!

Select Suryaa Now
అయ్యప్ప నామస్మరణతో శబరిమలకు మహా పాదయాత్ర: అయిజ కౌన్సిలర్ ఏ. శివ స్వామికి ఘన వీడ్కోలు!

శ్రీ మణికంఠుని దర్శనమే లక్ష్యంగా జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ ఏ. శివ స్వామి సుమారు 1,100 కిలోమీటర్ల సుదీర్ఘ శబరిమల మహా పాదయాత్రను ప్రారంభించారు. అయిజ పట్టణంలోని అయ్యప్ప స్వామి సన్నిధి నుంచి కేరళలోని పవిత్ర శబరిమల క్షేత్రం వరకు కాలినడకన సాగనున్న ఈ యాత్ర స్థానిక భక్తుల్లో విశేష ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపింది.

ఈ సందర్భంగా స్థానిక అయ్యప్ప ఆలయ ప్రాంగణంలో శివ స్వామిని పట్టణ ప్రముఖులు, నాయకులు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మధు మాస్టర్, మాజీ వైస్ చైర్మన్ నాగన్న గౌడ్, కౌన్సిలర్ డాక్టర్ కృష్ణ, తూపత్రాల వెంకన్న గౌడ్ తదితరులు పాల్గొని ఆయనకు వీడ్కోలు పలికారు.

స్వామివారి కృపతో ఎలాంటి ఆటంకాలు లేకుండా పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి కావాలని, శివ స్వామి సురక్షితంగా శబరిమల చేరుకుని అయ్యప్పను దర్శించుకోవాలని ప్రముఖులు ఆకాంక్షించారు. భక్తి, ఆధ్యాత్మిక సంకల్పంతో చేపట్టిన ఈ మహా పాదయాత్ర విజయవంతం కావాలని స్థానిక ప్రజలు, భక్తులు ప్రార్థించారు.