హెడ్డింగ్;మద్యం విక్రయాలు ప్రభుత్వ నిబంధనలు ప్రకారం జరపాలి . చింతలపూడి ఎక్సైజ్ సి ఐ పి అశోక్.
టి నరసాపురం సూర్య క్రైమ్ న్యూస్ మద్యం విక్రయాలు ప్రభుత్వ నిబంధనలు ప్రకారం జరపాలని చింతలపూడి ఎక్సైజ్ సి ఐ పి అశోక్ తెలిపారు. శనివారం చింతలపూడి ఎక్సైజ్ శాఖ పరిధిలో ఎన్ఫోర్స్మెంట్ సి ఐ భోగేశ్వర రావులతో కలసి ఎక్సైజ్ నేరముల కొరకు జాయింట్ రైడ్స్ నిర్వహించామన్నారు.. టి నరసాపురం మండలం బంధంచెర్ల గ్రామానికి చెందిన గుండే వెంకటేశ్వర రావు అను వ్యక్తికి సంబంధించిన నాటు సారాయి తయారీకి పనికి వచ్చే 100 లీటర్ల పులిసిన బెల్లపు ఊటను ధ్వంసం చేసి ఆ వ్యక్తి పై పరారీ కేసు నమోదు చేశామన్నారు.చింతలపూడి మండలంలో గల రేచర్ల గ్రామము లోని కొనుసోతు రాము,నాగిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన భూక్య శివ అను ఇరువురిని చింతలపూడి మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ వారి వద్ద హాజరుపరచగా 129 BNSS చట్ట ప్రకారం బైండోవర్ బాండ్ విధింవారన్నారు. అలాగే లింగపాలెం మండలం లో గల పలు మద్యం దుకాణాలలో ఎక్సైజ్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి మద్యం స్టాక్ ఎక్సైజ్ డిపో (APSBCL) నుండి వచ్చిన హోలోగ్రామ్ ,క్యూఆర్ కోడ్ లను ,కొన్ని మద్యం సీసాలు ఏ.పి.సురక్ష ఆన్లైన్ యాప్ ద్వారా సాధారణంగా పరిశీలించి , మద్యం అమ్మకాలు ప్రభుత్వ నిబంధనలు ప్రకారం జరపాలని, ఉల్లంఘించరాదని, సక్రమముగా పూర్తి నియమాలు,చట్టాలు పాటించవలసినదిగా మద్యం షాపులోని సేల్స్ సిబ్బందికి తెలియపరచామన్నారు. ఈ దాడులలో ఎస్.టి.ఎఫ్. సిఐ ఆర్ సత్యవతి చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ ఎస్.ఐ.అబ్దుల్ ఖలీల్, జె.జగ్గారావు సిబ్బంది పాల్గొన్నారన్నారు.
క్రైమ్ రిపోర్టర్ అద్దంకి గిరి కుమార్ ఏలూరు జిల్లా,