BREAKING
ఇల్లందు మున్సిపాలిటీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు అనుమతించిన ప్రాంతాల్లో బాణాసంచా కాల్చాలి మధురానగర్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు హాజరైన ఎమ్మెల్యే నవీన్‌ యాదవ్‌, వర్షా యాదవ్‌ ప్రజాసేవే పరమావధిగా... నియోజకవర్గ యువతకు నిలువెత్తు ఆదర్శం పెద్దిరెడ్డి. దసరా వేడుకలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలి: ఎస్పీ స్నేహ మెహ్రా డీసీసీ కార్యదర్శి శిరీష సత్తూరు జన్మదిన వేడుకలు కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపిన పిఎసి చైర్మన్ ఆరికపూడి గాంధీ శ్రీమహాలక్ష్మీదేవి అలంకరణలో గంగమ్మ తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా చక్రవర్ధన్ రెడ్డి -టీఎన్జీవోస్ యూనియన్ ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు ---భారీ బతుకమ్మల తో ప్రత్యేక ఆకర్షణ.. మహిళా ఉద్యోగుల కోలాటాలు, నృత్యాలతో సందడిగా మారిన యూనియన్ కార్యాలయం ---వెన్న ముద్దల బతుకమ్మ సందర్భంగా భక్తిశ్రద్ధలతో గౌరీదేవికి పూజలు.. సంప్రదాయబద్ధంగా ప్రత్యేక నైవేద్యాలు పీపల్‌ పహాడ్‌లో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేసిన రూప్ కుమార్ యాదవ్ గాంధీనగర్ బతుకమ్మ సంబరాలు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి మాలల రోస్టర్ పాయింట్లను సవరించాలి .. ఆకట్టుకున్న దసరా బొమ్మల కొలువు

ఘనంగా శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ రెండో వార్షికోత్సవం

Select Suryaa Now
ఘనంగా శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ రెండో వార్షికోత్సవం
సూర్య, ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణంలోని అంకాపూర్ శివారులో గల శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో రెండో వార్షికోత్సవ వేడుకలను శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ముదిరాజ్ సంఘం కుల పెద్దలు,  సభ్యులు, ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.వార్షికోత్సవంలో భాగంగా తెల్లవారుజామున పెద్దమ్మ తల్లికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, అమ్మవారికి విశేష పూజలు చేశారు. అనంతరం గణపతి పూజ, గౌరీ పూజలతో పాటు చండీ హోమాన్ని వేదమంత్రోచ్ఛారణల మధ్య భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు వెయ్యి మందికి పైగా మహిళలు సామూహిక కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. వార్షికోత్సవానికి విచ్చేసిన భక్తులందరికీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ చేపట్టారు.ఈ కార్యక్రమంలో పెద్ద బజార్ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు, కుల పెద్దలు, రాజాం నగర్ అధ్యక్షుడు జంగిడి, శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ అధ్యక్షుడు గాజం మచ్చందర్, జక్కం ప్రసాద్, బొండ్ల గోపి, వేముల భోజన్న, మందుల బాలనందు, సైదు రమేష్, సాంబడి ఆనంద్‌తో పాటు ముదిరాజ్ సంఘం సభ్యులు, ఆలయ కమిటీ ప్రతినిధులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.