BREAKING
మెటా అల్గారిథమ్స్‌పై కేంద్రం కీలక ఆదేశాలు: తప్పుదోవ పట్టించే కంటెంట్, శాంతిభద్రతల సమస్యలపై అడ్వైజరీ.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లకు మార్గదర్శకాలు! బ్రిటన్‌లో ఎన్‌స్కేల్‌తో డేటా సెంటర్ ఒప్పందాన్ని రద్దు చేసుకున్న మైక్రోసాఫ్ట్: ఐపీఓ వేళ స్టార్టప్‌కు గట్టి ఎదురుదెబ్బ! ఉక్రెయిన్‌లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ వేగంపై ఆంక్షలు ఉద్దేశపూర్వకమే: జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు.. డ్రోన్ డిఫెన్స్‌కు తీవ్ర ఆటంకం! చైనాలోని జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో భూకంపం: రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రత నమోదు.. మైసూరు దసరాలో సూర్యకిరణ్ ఎయిర్‌షో విన్యాసాలు: రెండు దశల్లో తొమ్మిది విమానాలతో గగనతల విన్యాసాలు.. వింగ్ కమాండర్ తేజేశ్వర్ సింగ్ వెల్లడి! నటుడు టైగర్ ష్రాఫ్‌ను పరామర్శించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే: కాల్పుల ఘటనపై ఆరా.. ఆరోగ్య పరిస్థితిపై సమీక్ష! ఫ్లోరిడాలో $191.8 మిలియన్లతో భారీ నీటి పునర్వినియోగ ప్రాజెక్ట్ పూర్తి: రోజుకు 32.5 లక్షల గ్యాలన్ల మురుగునీటి శుద్ధి.. మాతాంజాస్ నదికి కాలుష్య విముక్తి! యూపీకి చేరిన 308 చక్రాల ‘బాహుబలి’ ట్రక్: చెట్లు నరికి, విద్యుత్ స్తంభాలు తొలగించి దారి క్లియర్.. గమ్యస్థానానికి 200 టన్నుల భారీ మెషిన్! నేటి పంచాంగం – 19 అక్టోబర్ 2026. నేటి రాశి ఫలాలు – 19 అక్టోబర్ 2026 జపాన్, బ్రిటన్‌లను దాటేసి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: ఐఎంఎఫ్ తాజా అంచనాలు వెల్లడి! హెచ్-1బీ ఉద్యోగులపై వ్యాఖ్యలపై జేడీ వాన్స్ వివరణ:‘నా భాషలో లోపం ఉండొచ్చు’ అంటూ వ్యాఖ్య! ముంబైలో టెన్షన్.. టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించినట్లు ప్రకటన టీడీపీపార్టీ విజయానికి సమిష్టిగా కృషి చేయాలి . దాట్ల పృథ్వీరాజ్.. తెలంగాణ విద్యార్థులకు ఒక న్యాయం.. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మరో న్యాయమా?

ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి

Select Suryaa Now
ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంరాజమహేంద్రవరం నగరపాలక ఎన్నికల నోటిఫికేషన్ ఏక్షణంలో వచ్చినా ఉత్తమ స్థాయిలో నిర్వహించేందుకు సన్నద్ధంగా ఉండాలని కమిషనర్ రాహుల్ మీనా పిలుపునిచ్చారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ నందు వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల నిర్వహణపై శిక్షణా తరగతులు నిర్వహించారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాత తక్కువ సమయంలోనే ప్రక్రియ పూర్తిచేయవలసి ఉంటుందని.. కావున ముందస్తుగానే ఏర్పాట్లు పూర్తి చేసుకోవలసిందిగా సూచించారు. నోటిఫికేషన్‌కు ముందే అవసరమైన పనులు చేపడితే ఎన్నికల సమయంలో ఇబ్బందులు తగ్గుతాయని, అందుకే అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిర్దేశకాలపై అధికారులు, ఉద్యోగులు పూర్తి అవగాహన ఉండాలని సూచించారు. పునర్విభజన జరిగిన వార్డుల వారీగా ఇంటింటికి తిరిగి పక్కా ఓటర్ల జాబితా సిద్ధం చేసుకోవాలన్నారు. అలాగే వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్లను గుర్తించాలన్నారు. ఈసారి బ్యాలెట్‌ పెట్టెల ద్వారా ఎన్నికలు జరగనున్నందున ప్రతి అంశంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.  

పోలింగ్ కేంద్రాలను గుర్తించాలి*

ఎన్నికల సన్నద్ధతలో భాగంగా నగరంలో పోలింగ్ స్టేషన్లను గుర్తించడంతో పాటు వాటిలో మౌలిక వసతులు కల్పించవలసి ఉందని కమిషనర్ రాహుల్ మీనా అన్నారు. ప్రతి పోలింగ్‌బూత్‌లో 1000 మంది ఓటర్లు ఉండేలా చూడాలని, ప్రతి ఓటరు నివాసం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో పోలింగ్‌ కేంద్రాలు ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. పాఠశాల విద్య, ఉన్నత విద్య, పురపాలక శాఖకు చెందిన పాఠశాలలతో పాటు ప్రభుత్వ భవనాలు, వార్డు సచివాలయాలు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎక్కడా ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. ముఖ్యంగా అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద ర్యాంపుల నిర్మాణం తప్పనిసరిగా చేపట్టాలని.. విద్యుత్‌ సౌకర్యంతో పాటు ఫ్యాన్లు,  ఫర్నిచర్, తాగునీరు, టాయిలెట్లు తప్పనిసరిగా ఉండేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం *అదనపు కమిషనర్ పి.వి.రామలింగేశ్వర్* మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలో, అనంతరం చేపట్టాల్సిన చర్యలపై స్పష్టమైన అవగాహన కల్పించారు. సమీక్షలో సిటీ ప్లానర్ జీవీఎస్ఎన్ మూర్తి, డిప్యూటీ సిటీ ప్లానర్ నాయుడు, వార్డు సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.