BREAKING
రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుంది…కాంగ్రెస్ హామీలన్నీ నీటిమీద రాతలే!. నకిలీ భూ పత్రాలతో స్థలం విక్రయానికి యత్నం.. ఇద్దరు అరెస్ట్‌ దేశం నేత నాయుడుని కలిసిన కూటమి చైర్ పర్సన్ అభ్యర్థి శైలజ విజయం నీదా? నాదా?* *ఎన్నికల రిజర్వేషన్ తో వేడెక్కిన కుందుర్పి మండల రాజకీయాలు.* హైదరాబాద్, కామారెడ్డిలలో ఎక్సైజ్ శాఖ మెరుపు దాడులు: రెండు వేర్వేరు కేసుల్లో మద్యం బాటిళ్లు స్వాధీనం.. ఇద్దరి అరెస్ట్! సైదాపురంలో వైసీపీ తొలి ఎంపీటీసీ అభ్యర్థి ఖరారు కాంపా నిధులతో 10 లక్షల మొక్కల పెంపకం కడియం జడ్పిటిసి అభ్యర్థిగా శివాజీ పేదల ఇంట పండుగ వాతావరణం వెల్జాల్ లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ పులి శాంతికి అఖండ విజయం అందించాలి శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి గా అమ్మవారు భక్తులకు దర్శనం క్యాన్సర్ పరిశోధనకు బ్రిస్టల్ మైయర్స్ స్క్విబ్ సంస్థ విస్తృత మద్దతు ఇల్లందు మున్సిపాలిటీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు అనుమతించిన ప్రాంతాల్లో బాణాసంచా కాల్చాలి మధురానగర్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు హాజరైన ఎమ్మెల్యే నవీన్‌ యాదవ్‌, వర్షా యాదవ్‌

అట్టహాసంగా కూటమి మేయర్ అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు నామినేషన్ -- ర్యాలీలో ఎమ్మెల్యేలు బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్, పట్సమట్ల ధర్మరాజు, బిజెపి నేతలు తపన చౌదరి, విక్రమ్ కిషోర్ -- కూటమి ధర్మాన్ని పాటిస్తాం -ఏలూరు అభివృద్ధే లక్ష్యం- రెడ్డి అప్పలనాయుడు

Select Suryaa Now
అట్టహాసంగా కూటమి మేయర్ అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు నామినేషన్  -- ర్యాలీలో  ఎమ్మెల్యేలు బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్, పట్సమట్ల ధర్మరాజు, బిజెపి నేతలు తపన చౌదరి, విక్రమ్ కిషోర్           -- కూటమి ధర్మాన్ని పాటిస్తాం -ఏలూరు అభివృద్ధే లక్ష్యం- రెడ్డి అప్పలనాయుడు

ఏలూరు, మేజర్ న్యూస్ : జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  ఆశీస్సులత నగర మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు,  కూటమి ధర్మాన్ని పాటిస్తామని, ఏలూరు అభివృద్ధే ఏకైక లక్ష్యం అని ఎన్డీఏ కూటమి బలపరిచిన ఏలూరు నగర మేయర్ అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు తెలిపారు.  శనివారం భారీ ర్యాలీతో ఊరేగింపు గా బయలుదేరి మున్సిపల్ కార్యాలయం లో నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా టిడిపి అధ్యక్షులు, ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య చంటి , దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ , ఉంగుటూరు శాసనసభ్యులు పట్సమట్ల ధర్మరాజు , బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, తపన ఫౌండేషన్ అధినేత తపన సీతారామాంజనేయ చౌదిరి , బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ , రాష్ట్ర వడ్డీల కార్పోరేషన్ చైర్ పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి, జనసేన సీనియర్ నాయకులు నారా శేషు పలువురు కూటమి పెద్దలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తొలుత రెడ్డి అప్పలనాయుడు  అభయాంజనేయ స్వామి వారి దేవాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం భారీ జనసందోహంతో కూటమి నాయకుల సమక్షంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పలు ప్రాంతాల్లో ఆయనకి అపూర్వ స్వాగతం లభించింది. మహిళలు హారతులు ఇచ్చి, గుమ్మడికాయలతో దిష్టి తీశారు. అభిమానులు భారీ గజమాలలతో ఘనంగా స్వాగతం పలికారు. పూలవర్షాన్ని కురుపిస్తూ వారి అభిమానాన్ని చాటుకున్నారు.  ఏలూరులో కూటమి అభ్యర్థుల ప్రతి ఒక్కరిని గెలిపించాలని  కోరారు. రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ సమన్వయం, సమర్థత సమాలోచనలతో జనసేన పార్టీని తిరుగులేని శక్తిగా నిలుపుతానని, ముఖ్యంగా ఏలూరులో కూటమి ఐక్యత, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు, వీర మహిళల మనోభావాలు కాపాడే విధంగా అత్యంత నిబధ్ధతతో ముందుకెళ్తామని అన్నారు. ఒక పక్క జనసేన పార్టీని బలోపేతం చేస్తూనే, మరోపక్క కూటమి సఖ్యతను కాపాడే లక్ష్యంతో పనిచేస్తామన్నారు.

 పసుమర్తి రాము జిల్లా ఇంచార్జ్ ఏలూరు