జలదంకి మండలంలో టీడీపీకి భారీ బలం.. వైసీపీకి గట్టి షాక్..!
జలదంకి, మేజర్ న్యూస్ : జలదంకి మండల రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీకి మరింత బలాన్ని చేకూరుస్తూ వైసీపీకి చెందిన మాజీ మండల కన్వీనర్ పాలవెల్లి మాలకొండారెడ్డి తన ముఖ్య నాయకులు, అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. వింజమూరులోని తెలుగుదేశం ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాలకొండారెడ్డితో పాటు సుమారు 200 కుటుంబాలు టీడీపీలో చేరాయి.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పార్టీలో చేరిన పాలవెల్లి మాలకొండారెడ్డికి, ఆయన అనుచరులకు, వారి కుటుంబాలకు సాదర స్వాగతం పలికారు. వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ సిద్ధాంతాలు, కూటమి ప్రభుత్వ విధానాలు, సంక్షేమ - అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంపై విశ్వాసంతో పెద్ద సంఖ్యలో కుటుంబాలు పార్టీలో చేరినట్లు ఆయన తెలిపారు.
జలదంకి మండలంలో పాలవెల్లి మాలకొండారెడ్డికి ఉన్న రాజకీయ పరిచయాలు, ఆయన వెంట వచ్చిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అనుచర కుటుంబాల చేరికతో తెలుగుదేశం పార్టీకి క్షేత్రస్థాయిలో మరింత బలం చేకూరనుంది. ఈ చేరికలు మండల రాజకీయాల్లో టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపగా, వైసీపీకి గట్టి ఎదురుదెబ్బగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం, ప్రాధాన్యత కల్పిస్తూ ప్రజాసేవలో భాగస్వాములను చేస్తామని నాయకులకు భరోసా ఇచ్చారు.
మొత్తంగా, జలదంకి మండలంలో మాజీ మండల కన్వీనర్ పాలవెల్లి మాలకొండారెడ్డి నేతృత్వంలో సుమారు 200 కుటుంబాలు టీడీపీలో చేరడం ఉదయగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కీలక పరిణామంగా నిలిచింది. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సమక్షంలో జరిగిన ఈ భారీ చేరికలతో జలదంకి మండలంలో టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.ఈ కార్యక్రమం లో మండల టీడీపీ నాయకులు పాలుగోన్నారు.