BREAKING
నకిలీ భూ పత్రాలతో స్థలం విక్రయానికి యత్నం.. ఇద్దరు అరెస్ట్‌ దేశం నేత నాయుడుని కలిసిన కూటమి చైర్ పర్సన్ అభ్యర్థి శైలజ విజయం నీదా? నాదా?* *ఎన్నికల రిజర్వేషన్ తో వేడెక్కిన కుందుర్పి మండల రాజకీయాలు.* హైదరాబాద్, కామారెడ్డిలలో ఎక్సైజ్ శాఖ మెరుపు దాడులు: రెండు వేర్వేరు కేసుల్లో మద్యం బాటిళ్లు స్వాధీనం.. ఇద్దరి అరెస్ట్! సైదాపురంలో వైసీపీ తొలి ఎంపీటీసీ అభ్యర్థి ఖరారు కాంపా నిధులతో 10 లక్షల మొక్కల పెంపకం కడియం జడ్పిటిసి అభ్యర్థిగా శివాజీ పేదల ఇంట పండుగ వాతావరణం వెల్జాల్ లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ పులి శాంతికి అఖండ విజయం అందించాలి శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి గా అమ్మవారు భక్తులకు దర్శనం క్యాన్సర్ పరిశోధనకు బ్రిస్టల్ మైయర్స్ స్క్విబ్ సంస్థ విస్తృత మద్దతు ఇల్లందు మున్సిపాలిటీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు అనుమతించిన ప్రాంతాల్లో బాణాసంచా కాల్చాలి మధురానగర్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు హాజరైన ఎమ్మెల్యే నవీన్‌ యాదవ్‌, వర్షా యాదవ్‌ ప్రజాసేవే పరమావధిగా... నియోజకవర్గ యువతకు నిలువెత్తు ఆదర్శం పెద్దిరెడ్డి.

రూ ఏడు కోట్లతో జాతీయ రహదారిపై మరమ్మతు పనులు -- జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ చొరవ

Select Suryaa Now
రూ ఏడు కోట్లతో జాతీయ రహదారిపై మరమ్మతు పనులు  -- జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ చొరవ

ఏలూరు , మేజర్ న్యూస్ :  ఏలూరు జిల్లా ఎస్పీ  కె. ప్రతాప్ శివ కిషోర్   ప్రత్యేక చొరవతో ఎన్‌హెచ్-16 పై ఐదు ఫ్లైఓవర్ల ప్రమాదకర ఎత్తుపల్లాలకు రూ.7 కోట్లతో శాశ్వత పరిష్కారం కొరకు పనులు ప్రారంభమయ్యాయి. ప్రజల ప్రాణరక్షణే ధ్యేయంగా, వాహనదారుల సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా  ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్  చొరవ ఫలితంగా. జాతీయ రహదారి -16 పై తరచూ ప్రమాదాలకు కారణమవుతున్న ఫ్లైఓవర్ల ఎత్తుపల్లాల సమస్యకు శాశ్వత పరిష్కార మార్గం సుగమమైంది. కలపర్రు నుంచి గుండుగొలను వరకు గల ఐదు ప్రధాన ఫ్లైఓవర్లపై సుమారు రూ. 7 కోట్ల వ్యయం తో శాశ్వత నిర్మాణ పనులు ప్రారంభమ య్యాయి.ఎన్‌హెచ్-16 పై కలపర్రు నుంచి గుండుగొలను వరకు గల ఎస్.వి. రంగారావు విగ్రహం సమీపం, ఏలూరు ఆశ్రమం, కొవ్వలి, దెందులూరు , సత్యనారాయణపురం ఫ్లైఓవర్లపై రహదారి ఉపరితలం దెబ్బతిని ప్రమాదకరమైన ఎత్తుపల్లాలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై ఏలూరు జిల్లా డిస్ట్రిక్ట్ ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో  ద్వారా పలుమార్లు జాతీయ రహదారి అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, నిర్వహణ సంస్థ తాత్కాలికంగా బీటీ  మరమ్మతులు చేపట్టినప్పటికీ సమస్య పునరావృతమవుతూనే ఉంది.  ఏలూరు జిల్లా ఎస్పీ  స్వయంగా  ఫ్లైఓవర్లను పరిశీలించారు. సమస్య తీవ్రతను స్వయంగా అంచనా వేసి, తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టకుండా ఎత్తుపల్లాలను శాశ్వతంగా తొలగించాలని  అధికారులను  ఆదేశించారు.జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో ఈ అంశాన్ని ఎన్ హెచ్ పి డి సి ఎం ఓ విద్యాసాగర్  దృష్టికి  తీసుకెళ్లారు. ఎస్పీ  ఆదేశాలకు స్పందించిన ఎన్‌హెచ్ పీడీ విద్యాసాగర్  నిర్వహణ సంస్థ అయిన వరాహ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్' కంపెనీ ద్వారా శాశ్వత పనులు చేపట్టేలా తక్షణ చర్యలు ప్రారంభించారు.ప్రస్తుతం తొలిదశలో దెందులూరు , కొవ్వలి ఫ్లైఓవర్లపై దెబ్బతిన్న రోడ్డు బీటీ  సైడ్ కాంక్రీట్ వాల్‌ను తొలగించి శాశ్వత నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.తదుపరి దశలో ఆశ్రమం, ఎస్.వి. రంగారావు విగ్రహం సమీపం  సత్యనారాయణపురం ఫ్లైఓవర్లపై కూడా ఇదేరీతిలో పనులు చేపట్టనున్నారు.