BREAKING
ఇల్లందు మున్సిపాలిటీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు అనుమతించిన ప్రాంతాల్లో బాణాసంచా కాల్చాలి మధురానగర్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు హాజరైన ఎమ్మెల్యే నవీన్‌ యాదవ్‌, వర్షా యాదవ్‌ ప్రజాసేవే పరమావధిగా... నియోజకవర్గ యువతకు నిలువెత్తు ఆదర్శం పెద్దిరెడ్డి. దసరా వేడుకలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలి: ఎస్పీ స్నేహ మెహ్రా డీసీసీ కార్యదర్శి శిరీష సత్తూరు జన్మదిన వేడుకలు కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపిన పిఎసి చైర్మన్ ఆరికపూడి గాంధీ శ్రీమహాలక్ష్మీదేవి అలంకరణలో గంగమ్మ తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా చక్రవర్ధన్ రెడ్డి -టీఎన్జీవోస్ యూనియన్ ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు ---భారీ బతుకమ్మల తో ప్రత్యేక ఆకర్షణ.. మహిళా ఉద్యోగుల కోలాటాలు, నృత్యాలతో సందడిగా మారిన యూనియన్ కార్యాలయం ---వెన్న ముద్దల బతుకమ్మ సందర్భంగా భక్తిశ్రద్ధలతో గౌరీదేవికి పూజలు.. సంప్రదాయబద్ధంగా ప్రత్యేక నైవేద్యాలు పీపల్‌ పహాడ్‌లో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేసిన రూప్ కుమార్ యాదవ్ గాంధీనగర్ బతుకమ్మ సంబరాలు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి మాలల రోస్టర్ పాయింట్లను సవరించాలి .. ఆకట్టుకున్న దసరా బొమ్మల కొలువు

ప్లాస్టిక్‌ వినియోగం తగ్గించేందుకు స్టీల్‌ ప్లేట్ల పంపిణీ

Select Suryaa Now
ప్లాస్టిక్‌ వినియోగం తగ్గించేందుకు స్టీల్‌ ప్లేట్ల పంపిణీ
సూర్య బాల్కొండ / ముప్కాల్ : ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే లక్ష్యంతో ముప్కాల్‌ మండలం వెంచిర్యాల గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా శనివారం గ్రామంలోని దుర్గాదేవి మండపం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో స్టీల్‌ ప్లేట్లను ఎంపీడీఓ బి. రమేష్‌, సర్పంచ్‌ నిమ్మల రాజామణి-శ్రీనివాస్‌ చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ గ్రామంలో జరిగే వివాహాలు, పుట్టినరోజు వేడుకలు, ఇతర శుభకార్యాలు, సామాజిక కార్యక్రమాల్లో వినియోగించుకునేందుకు వీలుగా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో స్టీల్‌ ప్లేట్లను సమకూర్చినట్లు తెలిపారు. ప్లాస్టిక్‌ ప్లేట్ల వినియోగాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడటంతో పాటు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ఈ చర్య దోహదపడుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బి. రమేష్‌, సర్పంచ్‌ నిమ్మల రాజామణి-శ్రీనివాస్‌, ఉపసర్పంచ్‌ అన్నపూర్ణ దేవి -మధు , వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, జీపీవో, దుర్గభవాని సేవా సమితి సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.