BREAKING
ఇల్లందు మున్సిపాలిటీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు అనుమతించిన ప్రాంతాల్లో బాణాసంచా కాల్చాలి మధురానగర్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు హాజరైన ఎమ్మెల్యే నవీన్‌ యాదవ్‌, వర్షా యాదవ్‌ ప్రజాసేవే పరమావధిగా... నియోజకవర్గ యువతకు నిలువెత్తు ఆదర్శం పెద్దిరెడ్డి. దసరా వేడుకలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలి: ఎస్పీ స్నేహ మెహ్రా డీసీసీ కార్యదర్శి శిరీష సత్తూరు జన్మదిన వేడుకలు కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపిన పిఎసి చైర్మన్ ఆరికపూడి గాంధీ శ్రీమహాలక్ష్మీదేవి అలంకరణలో గంగమ్మ తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా చక్రవర్ధన్ రెడ్డి -టీఎన్జీవోస్ యూనియన్ ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు ---భారీ బతుకమ్మల తో ప్రత్యేక ఆకర్షణ.. మహిళా ఉద్యోగుల కోలాటాలు, నృత్యాలతో సందడిగా మారిన యూనియన్ కార్యాలయం ---వెన్న ముద్దల బతుకమ్మ సందర్భంగా భక్తిశ్రద్ధలతో గౌరీదేవికి పూజలు.. సంప్రదాయబద్ధంగా ప్రత్యేక నైవేద్యాలు పీపల్‌ పహాడ్‌లో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేసిన రూప్ కుమార్ యాదవ్ గాంధీనగర్ బతుకమ్మ సంబరాలు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి మాలల రోస్టర్ పాయింట్లను సవరించాలి .. ఆకట్టుకున్న దసరా బొమ్మల కొలువు

కావలి రూరల్‌లో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ దిశగా అడుగులు....!

Select Suryaa Now
కావలి రూరల్‌లో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ దిశగా అడుగులు....!

​కావలి మేజర్ న్యూస్ :  కావలి నియోజకవర్గంలో స్థానిక సంస్థల సమరం వేడెక్కింది. రాబోయే ప్రాదేశిక ఎన్నికలకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అందరికంటే ముందే సమరశంఖం పూరించి, ఎన్నికల మైదానంలో దూసుకెళ్తోంది. నియోజకవర్గ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి  సుదీర్ఘ రాజకీయ అనుభవం, దిశానిర్దేశంతో వైఎస్సార్సీపీ కావలి రూరల్ ప్రాంతాల్లో తిరుగులేని శక్తిగా నిలుస్తోంది.   ​కూటమి పరిధిలోని పార్టీలలో అంతర్గత విభేదాలు, వర్గపోరుతో నాయకులు ఏకాభిప్రాయానికి రాలేక కొట్టుమిట్టాడుతుంటే... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ‘ఏకవీర’గా నిలిచి నియోజకవర్గ పార్టీ శ్రేణులను ఏకతాటిపై నడిపిస్తున్నారు. ఎక్కడా ఎలాంటి అంతర్గత కలహాలకు తావులేకుండా, కార్యకర్తలకు, ద్వితీయ శ్రేణి నాయకులకు, సాధారణ ప్రజలకు ఆప్తబంధువుగా నిలుస్తూ ‘మకుటం లేని మహారాజు’గా అందరి మనసులను గెలుచుకున్నారు.   ​ఎన్నికల సమరంలో వైఎస్సార్సీపీ సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది.  ​ కావలి రూరల్ పరిధిలోని 17 పంచాయితీలకు సంబంధించిన ప్రణాళికలు ఇప్పటికే పూర్తయ్యాయి.  ​ కావలి రూరల్ ప్రాంతాల్లో నామినేషన్ల ఘట్టానికి పార్టీ శ్రేణులను సంపూర్ణంగా సంసిద్ధం చేశారు.  ​సామాజిక న్యాయం & మహిళలకు పెద్దపీట: అన్ని సామాజిక వర్గాలకు సమాన ప్రాధాన్యం కల్పిస్తూ, మహిళా అభ్యర్థులకు పెద్దపీట వేస్తూ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేశారు.  

​విజయం వైఎస్సార్సీపీదే..
​పార్టీని నమ్ముకున్న ప్రతి కార్యకర్తకూ, నాయకుడికీ నేనున్నానంటూ భరోసా ఇస్తున్న రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి  నాయకత్వంపై ప్రజలకు, పార్టీ శ్రేణులకు పూర్తి విశ్వాసం వ్యక్తమవుతోంది. వెల్లువెత్తుతున్న ప్రజా మద్దతు, గ్రామీణ ప్రాంతాలలో కనిపిస్తున్న జనసందోహాన్ని బట్టి చూస్తే రాబోయే ప్రాదేశిక ఎన్నికల్లో కావలి రూరల్ ప్రాంతంలో వైఎస్సార్సీపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని విజయకేతనం ఎగురవేయడం ఖాయంగా కనిపిస్తోంది.