బెల్టు షాపులు నిర్మూలించాలని పాలకవర్గ సభ్యుల వినతి
సూర్య- బిక్కనూర్ : మండలంలోని కాచాపూర్ గ్రామంలో బెల్ట్ షాపులను నిర్మూలించాలని కోరుతూ, శనివారం ఎక్సైజ్ ఎస్సై దీపికకు పాలకవర్గ సభ్యులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉపసర్పంచ్ బైండ్ల తొగది దశరథం మాట్లాడుతూ గ్రామంలో బెల్టు షాపులు ఉండొద్దని గతంలో పాలకవర్గ సభ్యులు గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం చేశారని, దానికి విరుద్ధంగా గ్రామంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులను ఏర్పాటు చేయడంతో, యువత మద్యం మత్తులో మునిగి తేలుతున్నారని, తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, తక్షణం ఎక్సైజ్ శాఖ సిబ్బంది దాడులు నిర్వహించి గ్రామంలో బెల్ట్ షాపులు లేకుండా చూడాలని వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ ఎస్సై దీపిక మాట్లాడుతూ గ్రామాలలో బెల్ట్ షాపుల నిర్మూలనకు తమ వంతుగా కృషి చేస్తున్నామని, ప్రజా ప్రతినిధుల సహకారంతో గ్రామంలో ఎలాంటి బెల్ట్ షాపులు లేకుండా కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు ఉప సర్పంచ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ పాలక వర్గ సభ్యులు పాల్గొన్నారు.