BREAKING
ఎస్ ఐ ఆర్ పై ఉన్నత స్థాయి సమీక్ష ప్రధాన ఎన్నికల అధికారితో వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ పంపిణీ చేసిన సర్పంచ్ బందెల సుజాత–బాలకిషన్ నాగర్ కర్నూలు సరస్వతి దేవి అలంకరణలో వాసవి మాత మహాలక్ష్మి కాలనీలో వైభవంగా మహాచండీ హోమం మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా మహిళా సర్పంచుల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు జలదంకి మండలంలో టీడీపీకి భారీ బలం.. వైసీపీకి గట్టి షాక్..! తెలుగునాట జైలర్ 2 బాక్సాఫీస్ సునామీ: మా నమ్మకం నిజమైందన్న నిర్మాత నాగవంశీ! ప్లాస్టిక్‌ వినియోగం తగ్గించేందుకు స్టీల్‌ ప్లేట్ల పంపిణీ రీ-సర్వే ప్రక్రియలో ఖచ్చితత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలి * అదనపు కలెక్టర్ బి. చెన్నయ్య సరస్వతి దేవి అలంకారంలో అన్నపూర్ణాదేవి అట్టహాసంగా కూటమి మేయర్ అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు నామినేషన్ -- ర్యాలీలో ఎమ్మెల్యేలు బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్, పట్సమట్ల ధర్మరాజు, బిజెపి నేతలు తపన చౌదరి, విక్రమ్ కిషోర్ -- కూటమి ధర్మాన్ని పాటిస్తాం -ఏలూరు అభివృద్ధే లక్ష్యం- రెడ్డి అప్పలనాయుడు ఘనంగా శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ రెండో వార్షికోత్సవం కావలి రూరల్‌లో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ దిశగా అడుగులు....! ఎస్‌ఎస్‌ఆర్‌ (SSR) ప్రక్రియ అవసరంపై దిగ్విజయ్ సింగ్ ప్రశ్నల వర్షం: ఈసీ జ్ఞానేష్ కుమార్‌కు లేఖ.. సమగ్ర వివరణ ఇవ్వాలని డిమాండ్! నందివాడలో శరన్నవరాత్రి వేడుకలు.. ‘శ్రీ గాయత్రీ దేవి’ అవతారంలో మురిసిన జగన్మాత!

రాజకీయ పార్టీలు ఎన్నికలు నిర్వహణకు సహకరించాలి :మండల రిటర్నింగ్ అధికారి సత్యనారాయణ

Select Suryaa Now
రాజకీయ పార్టీలు ఎన్నికలు నిర్వహణకు సహకరించాలి :మండల రిటర్నింగ్ అధికారి సత్యనారాయణ

ఇరగవరం సూర్య న్యూస్:ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు సహకరించాలని ఇరగవరం మండల ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారి మరియు రిటర్నింగ్ అధికారి కె.వి.వి. సత్యనారాయణ కోరారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల అవగాహన సదస్సులో అయన పాల్గొని మాట్లాడారు. స్థానిక ఎన్నికలు సంబంధించి ఈ నెల20నుంచి నామినేషన్ పత్రాలు పంపిణి చేస్తారన్నారు. 21 నుండి 23 వరకు నామినేషన్ దాఖలు చేసుకోవచ్చు నవంబర్ 3న ఎలక్షన్, 5తేదీన కౌంటింగ్ పూర్తిచేసి అదే రోజూ గెలుపొందిన అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు.ఉదయం 10.30నుండి సాయంత్రం 5గంటలవరకు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు.నామినేషన్ ఉపశమహరించుకునే అభ్యర్డులు 21నుండి 23 తేదీ 3గంటలలోపు ఉపశమహరించుకోవాలని చెప్పారు.కుల,మత,వర్గ విభేదాలతో ఘర్శనలకు పాల్పడకుండా తగిన విధంగా సహకరించాలని పార్టీ శ్రేణులను కోరారు.అలా ఎవరైనా ఘర్శనలకు పాల్పడితే ఎన్నికల నియామవాళి ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు.ఎవరైనా అభ్యర్డులు నామినేషన్ వేసే సమయంలో తప్పనిసరిగా అభ్యర్థనను స్వయంగా రిటర్నంగ్ అధికారికి సమర్పించాలన్నారు. నామినేషన్ పత్రాన్ని తప్పులేకుండా పూరించలన్నారు.అభ్యర్థి ఆధార్ ప్రకారం తమ వివరాలు సమర్పించాలన్నారు.నామినేషన్ దాఖలుకు అవసరమైన అన్ని పత్రాలను నామినేషన్ సమయంలో సమర్పించాలని సూచించారు. అసంపూర్తిగా ఉన్న అభ్యర్థనలను తిరస్కరించే అవకాశం ఉన్నందున దరఖాస్తు ఫారం సమర్పించే ముందు సరిచేసుకోవాలన్నారు.నామినేషన్ దాఖలు చేసేవారు జనరల్ కేటగిరి అభ్యర్డులు 3వేల రూపాయలు నిర్ణిత దారావత్తు జామ చేయాలన్నారు. రిజర్వేషన్ కేటగిరి అభ్యర్డులు 15 వందల రూపాయలు దారావత్తు చెల్లించాలన్నారు.ఫిర్యాదులు ఏమైనా ఉంటే స్వయంగా రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చెయ్యాలి సోషల్ మీడియాలో ప్రచారం చేయకూడదన్నారు.ఎన్నికల్లో పాల్గొనే ఏజెంట్లు తప్పనిసరిగా గుర్తింపు కార్డులు పొందాలన్నారు. కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఏ.శ్రీనివాస్, తాహిసీల్దార్ ఎమ్.సుందర్రాజు, సిపిఎం మండల కన్వీనర్ కామన మునిస్వామి, సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు జుత్తిగ రామాంజనేయులు,అన్ని పార్టీల నాయకులు,సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

 రిపోర్టర్: దొరబాబు, ఇరగవరం పశ్చిమ గోదావరి జిల్లా