telanagana
ముఖ్య మంత్రి సహాయనిది చెక్కు పంపిణి
సూర్య,లింగంపేట్:లింగంపేట్ మండల కేంద్రానికి చెందిన బాధిత కుటుంబానికి శనివారం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సాయిరాం యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పంపిణీ చేసారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు సాయిరాం యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఎంఆర్ఎఫ్ పథకం ఎంతో మంది పేదలకు అండగా నిలుస్తున్నారని కొనియాడారు.యెల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావ్ సహకారంతో మండలంలోని ప్రతి నిరుపేదకు ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ కౌడ రవీందర్,కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు,ఉప సర్పంచ్ ప్రసాద్ గౌడ్,రాష్ట్ర మైనార్టీ ప్రధాన కార్యదర్శి రఫీయొద్దీన్,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గుండా బాలకిషన్,మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తుమ్మల శ్రీనివాస్ రెడ్డి,బీసీ సెల్ అధ్యక్షులు దూరిశెట్టి అశోక్,పిఎసీఎస్ డైరెక్టర్ ఎదుల్,లక్ష్మీనారాయణ,జక్షాని రవి,వార్డు మెంబర్ సునీల్,శంకర్,భాస్కర్ గౌడ్,పీర్సింగ్ రియాజ్,కాంగ్రెస్ మండల నాయకులు,కార్యకర్తలు,గ్రామస్తులు పాల్గొన్నారు.